జబర్దస్త్ షో ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి గెటప్ శ్రీను కూడా ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే.గెటప్ శ్రీను వెరైటీ ఎక్స్ ప్రెషన్లు ఇస్తూ చేసే స్కిట్లు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
సుడిగాలి సుధీర్ స్కిట్లలో ఎక్కువగా నటించే గెటప్ శ్రీను ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లను కూడా ఆందిపుచ్చుకుంటున్నారు.జాంబీరెడ్డి సినిమాలోని పాత్ర గెటప్ శ్రీనుకు మంచిపేరు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.
అయితే గత కొన్ని వారాలుగా జబర్దస్త్ షో స్కిట్లలో గెటప్ శ్రీను కనిపించడం లేదు.దీంతో అతని ఫ్యాన్స్ తెగ కంగారు పడ్డారు.జబర్దస్త్ షోకు గెటప్ శ్రీను గుడ్ బై చెప్పారా.? అనే అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి.అయితే తాజాగా ఒక సందర్భంలో గెటప్ శ్రీను నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు జబర్దస్త్ లో కనిపించకపోవడానికి అసలు కారణాలను వెల్లడించారు.తాను ఒక మూవీ షూటింగ్ లో పాల్గొన్న సమయంలో కొంతమందికి పాజిటివ్ వచ్చిందని గెటప్ శ్రీను అన్నారు.
అందువల్ల తాను కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నానని అయితే పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చిందని గెటప్ శ్రీను అన్నారు.అయితే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని గెటప్ శ్రీను అన్నారు.
ఈ నెల 18వ తేదీన ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో తాను కనిపిస్తానని గెటప్ శ్రీను పేర్కొన్నారు.హోం ఐసోలేషన్ లో ఉండటం వల్ల జబర్దస్త్ షోకు కొన్ని వారాల పాటు హాజరు కాలేకపోయానని గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు.