ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన ఆ ఇద్దరు మూడేళ్ల ఎదురు చూపులు

ఇండస్ట్రీలో ట్యాలెంట్‌ తో పాటు అదృష్టం కూడా కావాల్సి ఉంటుంది.లక్ ఉండి సక్సెస్‌ దక్కినా కూడా కొన్ని సార్లు అనుకోని కారణాలతో పెద్ద ఎత్తున అడ్డంకులు తగిలి సినిమా లు ఏళ్లకు ఏళ్లు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్‌ డైరెక్టర్స్‌ పరిస్థితి దారుణంగా ఉంది.2018 సమ్మర్ లో సుకుమార్ రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక కొరటాల శివ దర్శకత్వం లో భరత్‌ అనే నేను సినిమా వచ్చింది.

రెండు కూడా కొద్ది రోజుల తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఈ రెండు సినిమా లు మంచి హిట్ గా నిలిచాయి.ముఖ్యంగా రంగస్థలం చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక భరత్‌ అనే నేను కూడా వంద కోట్ల కు పైగా వసూళ్లను దక్కించుకుంది.రెండు సినిమా లతో సూపర్‌ డూపర్‌ హిట్‌ లను దక్కించుకున్న దర్శకులు ఇప్పటి వరకు తమ తదుపరి సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో విఫలం అయ్యారు.

సుకుమార్ రంగస్థలం పూర్తి అయిన వెంటనే మహేష్ బాబుతో సినిమా ను చేయాలని భావించాడు.కాని కథ ఓకే అవ్వని కారణంగా సినిమా నిలిచి పోయింది.ఆ తర్వాత ఇద్దరి మద్య క్రియేటివ్‌ విభేదాల కారణంగా సినిమా క్యాన్సిల్‌ అయ్యిందని అధికారికంగా వార్తలు వచ్చాయి.

Advertisement

ఇక రంగస్థలం సినిమా తర్వాత చిరంజీవి తో కొరటాల శివ సినిమా చేయాల్సి ఉంది.కాని కొన్ని కారణాల వల్ల ఆచార్య సినిమా మరీ ఆలస్యం అయ్యింది.

సైరా నరసింహా రెడ్డి సమయంలోనే ఆచార్య మొదలు పెట్టాలనుకున్నా కూడా చిరంజీవి ఆరోగ్యం ఇతర విషయాల కారణంగా మొదలు పెట్టలేక పోయారు.వీరిద్దరు సినిమా లు మొదలు పెట్టారో లేదో కరోనా వచ్చింది.

దాంతో ఏడాదిగా మళ్లీ వీరి సినిమా లు వాయిదా పడ్డాయి.మళ్లీ వీరి సినిమా లు ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు అనే విషయమై క్లారిటీ లేదు.

ఆచార్యను ఈ ఏడాదిలో విడుదల చేసి తీరాలని చిరంజీవి బలంగా ఉన్నాడు.పుష్ప సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఈ ఏడాదిలోనే వస్తుందని సుకుమార్‌ చెబుతున్నాడు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

మొత్తానికి ఈ ఇద్దరు దర్శకులు ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చి కూడా ఇంత కాలం టైమ్ వృదా చేశారు.

Advertisement

తాజా వార్తలు