ఆనందయ్య కంటి మందు ఇప్పట్లో లేనట్లే..!

కృష్ణపట్నం ఆనదయ్య కరోనా మందుపై ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆనందయ్య తయారు చేసిన ఐదు మందుల్లో నాలుగు మందులకు ఆయుష్ నివేదిక అందించింది.

అయితే కంటిమందు మీద మాత్రం తమ నివేదిక అందించలేదు.ఆననయ్య మందు మీద గురువారం ఏపీ హైకోర్ట్ లో విచారణ జరిగింది.

ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్ట్ తీర్పుని రిజర్వ్ లో ఉంచింది.ఆనందయ్య కంటిమందుని తాము వ్యతిరేకించడం లేదని కంటిమందు విషయంలో వైద్య నిపుణుల కమిటీ రావాల్సి ఉందని ప్రభుత్వం కోర్టుకి చెప్పింది.

వారి ఆమోదం లేకుండా కంటిమందుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమని వెల్లడించారు.అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి కంటిమందు అనుమతి ఇస్తారా అన్న ధర్మాసనం ప్రశ్నకు సమాధానంగా అలా ఇస్తే అందరూ అత్యవసర పరిస్థితి అంటూ వస్తారని ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పారు.

Advertisement

ఆనందయ్య తరపున న్యాయవాది అశ్వినీ కుమార్ రోజుకి 20 మందే వస్తున్నారని చెప్పారు.ఆనందయ్య కంటిమందుపై నివేదిక వచ్చేందుకు 3 వారాల టైం పడుతుందని అప్పటివరకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం వెల్లడించింది.

ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్ట్ తీర్పుని రిజర్వ్ చేసింది.అయితే జూన్ 7 నుండి ఆనందయ్య మందు అందిస్తారని తెలుస్తుంది.

ఆన్ లైన్ లో ఈ మందు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు