ఎన్టీఆర్ మూవీకి ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరనే సంగతి తెలిసిందే.

టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

రాజమౌళి తర్వాత ఆ స్థాయి ప్రతిభ ఉన్న దర్శకునిగా పేరును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో భారీ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కిస్తుండటం గమనార్హం.సలార్ సినిమాలో ప్రభాస్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారని సమాచారం.

బాహుబలి తర్వాత ప్రభాస్ మరోసారి ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.ఛత్రపతి తరువాత ప్రభాస్ చేస్తున్న పూర్తిస్థాయి మాస్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ఇదే కావడం గమనార్హం.

ఈ మధ్య కాలంలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న శృతిహాసన్ ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటిస్తున్నారు.అయితే ప్రభాస్ మూవీ పూర్తైన వెంటనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు షిఫ్ట్ అవుతున్నారు.

Advertisement

ప్రశాంత్ నీల్ తొలిసారి మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి ఈ సినిమాకు పని చేయనున్నారు.ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు తీసుకున్న మొత్తం కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కేవలం 10 కోట్ల రూపాయల పారితోషికం మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది.నిర్మాతలు ప్రశాంత్ నీల్ అడిగితే ఎక్కువ మొత్తం పారితోషికం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

అయితే ప్రశాంత్ నీల్ మాత్రం రెమ్యునరేషన్ విషయంలో పట్టింపులకు పోవడం లేదని తెలుస్తోంది.కేజీఎఫ్ 2, సలార్ సినిమాలు రిలీజైన తరువాత ఈ డీల్ సెట్టై ఉంటే మాత్రం ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ భారీగా పెరిగేదని సమాచారం.

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు