మేజర్ సినిమాలో సాయి మంజ్రేకర్.. వైరల్ ఫోటో!

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ తెగ పరిచయమవుతున్నారు.ఇప్పటికే పలువురు హీరోయిన్స్ తెలుగు సినిమాలలో నటించగా.

మరికొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగులో పాన్ ఇండియా సినిమాల్లో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే మరో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ బ్యూటీ ఫస్ట్ లుక్ ను సిని బృందం విడుదల చేయగా వైరల్ గా మారింది.శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా మేజర్.

ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు.మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోగ్రఫీ తో ఈ సినిమా రూపొందుతుంది.

Advertisement

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.తాజాగా సినీ బృందం ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా.

అందులో అడవి శేష్ పక్కన కూర్చొని ఉన్నాడు.

ఈ ఫోటోలో ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్ యూనిఫామ్ లో సాయి మంజ్రేకర్, అడవి శేష్ కనిపిస్తున్నారు.డిఫెన్స్ అకాడమీ కి సెలెక్ట్ అయినందుకు లెటర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్న పోస్టర్ ఉండగా ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.ఇక ఈ సినిమా తెలుగు, హిందీలో విడుదల కానుంది.

మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిలిం ఇండియా నిర్మిస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇక ఈ సినిమా టీజర్ ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు.ఇదిలా ఉంటే జూలై 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

ఇందులో ప్రకాష్ రాజ్, శోభితా ధూళిపాళ, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు