అనగనగా ఒక రౌడీ ఓ సామాన్య వ్యక్తి బయోపిక్ అంటున్న దర్శకుడు

ఈ మధ్యకాలంలో ఇండియన్ సినిమాలో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది.చాలా మంది దర్శక, నిర్మాతలు కొత్త కథల కోసం నిజజీవిత కథలపై ఆధారపడుతున్నారు.

నిజజీవితంలో సక్సెస్ అయిన వ్యక్తుల కథలని తీసుకొని వాటిని తెరపై అంతే నేచురల్ గా చూపిస్తూ సూపర్ సక్సెస్ లు కొడుతున్నారు.అయితే ఇలా తాము తెరకెక్కిస్తున్నవి బయోపిక్ కథలు అనే విషయాన్ని కొందరు ముందుగానే రివీల్ చేస్తూ ఉంటే మరికొందరు సినిమా రిలీజ్ చేసే సమయంలో రివీల్ చేస్తున్నారు.

మరికొందరు సినిమా రిలీజ్ తర్వాత ఎండ్ కార్డ్ లో అసలు విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.ప్రముఖులుగా ఉన్నవారి బయోపిక్ లు అయితే వాటిమీద హైప్ ఉంటుంది కాబట్టి ముందుగానే రివీల్ చేసేస్తున్నారు.

ఇక తెలుగులో సావిత్రి బయోపిక్ మహానటి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.అయితే ఆ సినిమా తర్వాత సెలబ్రిటీ బయోపిక్ లు ఎన్ని వచ్చిన వర్క్ అవుట్ కాలేదు.అయితే కోలీవుడ్ లో సుధా కొంగర ఆకాశం నీ హద్దురా అనే సినిమాని తెరకెక్కించింది.

Advertisement

ఈ సినిమా బయోపిక్ స్టొరీ అని సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రివీల్ చేసింది.అలాగే అజయ్ భూపతి ఆర్‌ఎక్స్ 100 మూవీ ఎండ్ కార్డ్ లో తన ఫ్రెండ్ నిజజీవిత కథ అనే విషయాన్ని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.

అలాగే తాజాగా రిలీజ్ అయిన శ్రీకారం సినిమా ఎండ్ కార్డులో కూడా ఓ యువరైతు నిజజీవిత కథని స్పూర్తిగా తీసుకొని చేసిన సినిమాగా అతని ఫోటోతో పాటు రివీల్ చేశారు.ఇదిలా ఉంటే ఇప్పుడు సుమంత్ హీరోగా అనగనగా ఓ రౌడీ అనే సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాతో మనుయజ్న దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఈ సినిమా కథ ఓ సామాన్యుడి బయోపిక్ అనే విషయాన్ని అతను తాజాగా రివీల్ చేశాడు.

ఊరికి, ఇంటివాళ్లకి తలనొప్పిగా మారిన ఓ పచ్చి తాగుబోతు ఒక సమయంలో రియలైజ్ అయ్యి ఒక సక్సెస్‌ఫుల్ పారిశ్రామిక వేత్తగా ఎదిగి, ఆ సామాన్యుడు అసామాన్యుడుగా నలుగురికి ఎలా ఆదర్శప్రాయంగా నిలిచాడు అనేది కథ.మురళి కున్నుం పురత్ అనే వ్యాపారి నిజజీవిత కథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం అని తెలిపారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు