విశాఖ స్టీల్ ప్లాంట్ రగడ: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. రంగంలోకి ఎన్ఆర్ఐలు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే కార్మిక, ప్రజా సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు రోడ్డెక్కాయి.

గత కొన్ని రోజులుగా నిరసనలు, ధర్నాలతో సాగర తీరం అట్టుడుకుతోంది.దీనికి తోడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తన ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో వ్యవహారం శృతి మించి రాగాన పడింది.

ఆ తర్వాతి రోజు నుంచి ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యింది.దీనిపై మరింత లేట్ చేస్తే ప్రమాదమని గ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి .ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.ప్రైవేటీకరణకు బదులు గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించాలని జగన్ కోరారు.

అలాగే స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఢిల్లీలో వైసీపీ ఎంపీలు కేంద్రంతో సంప్రదింపులు మొదలుపెట్టారు.దీనిలో భాగంగా ఉక్కు కర్మాగారానికి ఒడిశాలోని గనులు కేటాయించాలని కోరుతూ విజయసాయిరెడ్డి.కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.

Advertisement

మరోవైపు స్టీల్ ప్లాంట్ ఉద్యమం నానాటీకి తీవ్రతరం అవుతుండటంతో వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు పరిస్ధితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.ఆంధ్రుల హ‌క్కుగా భాసిల్లిన విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేటీక‌రించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకునేందుకు ప్రవాసాంధ్రులు సిద్దమవుతున్నారు.ఈ పరిణామంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ఎన్నారైలు, త్వ‌ర‌లోనే ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌నున్నారు.

దీనిలో భాగంగా అమెరికా సహా పలు దేశాల్లో వున్న తెలుగు సంఘాలు కదనరంగంలోకి దూకనున్నాయి.దీనిలో భాగంగా అమెరికాలోని భార‌త దౌత్య కార్యాలయాలలో విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా మెమొరాండం స‌మ‌ర్పించ‌నున్నారు.

అదే విధంగా ఇత‌ర దేశాల్లోని భార‌త దౌత్య కార్యాల‌యాల్లోనూ వీటిని అందించి, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దనే డిమాండ్‌ను గ‌ట్టిగా వినిపించ‌నున్నారు.అదే స‌మ‌యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మ‌కానికి వ్య‌తిరేకంగా భారీ ఉద్య‌మానికి కూడా శ్రీకారం చుట్ట‌నున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు