ఛీ ఛీ కర్నాటక అసెంబ్లీలో గలీజు పని.. ఇలాంటి నాయకులా రాజకీయాల్లో.. ??

ఒంటి మీద తెల్లబట్టలు వేసుకుని రాజకీయాలు చేసే వారందరిలో మంచి వారుంటారు అనుకుంటే పొరబాటేనట.

వస్త్రాలు తెల్లవే కానీ మనస్సు మాత్రం ఎప్పుడు మురికి కుంటలా నిండిపోయి ఉంటుంది రాజకీయ నాయకులకు అని అనుకుంటారు జనం.

ఇలా అందరు లేకపోయినా కొందరు మాత్రం తమ మనస్సును, బుద్ధిని అదుపులో పెట్టుకోకుండా చాటుమాటుగా చేయకూడని పనులు చేస్తారు.అది చట్టాలు రూపొందించే చట్ట సభలో.

ఇలాంటి చోట ప్రజా సమస్యలపై నోరు విప్పకుండా, ఓ ప్రజాప్రతినిధి అశ్లీల వీడియోలు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.కర్నాటక అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండగా ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ సెల్‌ఫోన్‌లో, అశ్లీల వెబ్‌సైట్‌లో వీడియోలు చూస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నాడట అనే వార్త ప్రచారం జరుగుతుంది.

కానీ ఆయన మాత్రం ఈ వార్తలను ఖండించారు.గ్రామీణాభివృద్ధిపై మంత్రితో మాట్లాడుతూ, దానికి సంబంధించిన ప్రశ్నల కోసం సెల్‌ఫోన్‌లో వెతుకుతున్నానని వివరణ ఇచ్చారట.

Advertisement

ఇదిలా ఉండగా కర్నాటక అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూడడం కొత్తేం కాదంటున్నారు.ఇక ఈ విషయం తెలిసిన ప్రజలతో పాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇదేం గలీజు పని, ఇలాంటి నాయకులు ఉండవలసింది రాజకీయాల్లో కాదు అని కామెంట్స్ చేస్తున్నారట.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు