స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వ పిటిషన్ పై సుప్రీం స్పందన..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా పరిస్థితి నెలకొంది.

ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిలీజ్ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో హైకోర్టు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం.

అందరికీ తెలిసిందే.ఈ తరుణంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో వేసిన పిటిషన్ తాజాగా విచారణకు రాగా.

ప్రభుత్వం వేసిన పిటిషన్ లో అనేక తప్పులు ఉన్నాయని.వాటిని సరి చేసే విషయంలో కొన్ని సూచనలు తెలియజేసింది.

దీంతో ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు సోమవారం వచ్చే అవకాశం ఉంది.మరో పక్క చూస్తే గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కావడం తో సుప్రీం కోర్టులో ప్రభుత్వ పిటిషన్ విచారణ కి రాకముందే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

దీంతో సోమవారం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది సస్పెన్స్ గా మారింది. .

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు