కరోనా అప్డేట్ : తెలంగాణలో 24 గంటల్లో 1,451 కేసులు !

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.ఒకవైపు తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.

ఈ క్రమంలో మళ్లీ కరోనా పెరిగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయ పడుతుండటంతో రాష్ట్ర వాసుల్లో ఆందోళన రోజురోజుకి పెరిగిపోతుంది.తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరో  1,451 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.తాజాగా నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,20,675 కు చేరింది.24 గంటల్లో 9 మంది కరోనా బారిన పడి మరణించగా.మృతుల సంఖ్య 1,265 చేరింది.

ఇక కరోనా మహమ్మారి నుంచి తాజాగా 1,983 మంది డిశ్చార్జ్‌ కాగా.కోలుకున్న వారి సంఖ్య 1,96,636 కు చేరింది.

ప్రస్తుతం తెలంగాణలో 22,774 యాక్టివ్ కేసులు ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో42,497 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 37,89,460 కు చేరింది.

Advertisement

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ ఎంసీ పరిధిలో 235, ఆదిలాబాద్ 8, భద్రాద్రి కొత్తగూడెం 92, జగిత్యాల్‌ 29, జనగాం 28, జయశంకర్ భూపాలపల్లి 22, జోగులమ్మ గద్వాల్‌ 11, కామారెడ్డి 34, కరీంనగర్‌ 65, ఖమ్మం 71.కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 7, మహబూబ్‌ నగర్‌ 32, మహబూబాబాద్ ‌ 24, మంచిర్యాల్‌ 22, మెదక్‌ 25, మేడ్చల్ మల్కాజ్‌గిరి 101, ములుగు 20, నాగర్‌ కర్నూల్‌ 22, నల్గొండ 84, నారాయణ్‌పేట్‌ 15, నిర్మల్‌ 24, నిజామాబాద్‌ 32, పెద్దంపల్లి 28, రాజన్న సిరిసిల్ల 30, రంగారెడ్డి 104, సంగారెడ్డి 32, సిద్ధిపేట్‌ 64, సూర్యాపేట 37, వికారాబాద్‌ 22, వనపర్తి 24, వరంగల్‌ రూరల్‌ 28, వరంగల్‌ అర్బన్‌ 55, యాద్రాది భువనగిరి 24 కేసులు నమోదయ్యాయి.

పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు