కరోనాతో ఎంపీ అశోక్ గస్తీ మృతి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.ఈ మహమ్మారి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు తీసుకుంది.

సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు.కొందరు హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

మరికొందరు ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు.వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

పార్టీ నాయకుల్లో వైరస్ వ్యాప్తితోపాటు మరణాల ఎక్కువగా సంభవిస్తుండటంతో అనుచరులు, కార్యకర్తల్లో కరోనా భయం వెంటాడుతోంది.తాజాగా కరోనాతో మరో ఎంపీ ప్రాణాలు విడిచారు.

Advertisement

కర్ణాటక బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ (55) కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకున్నారు.

రిపోర్టులో పాజిటివ్ రావడంతో సెప్టెంబర్ 2వ తేదీన బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలోనే చనిపోయారు.

అశోక్ గస్తీ మరణవార్త విని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమాలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఈ ఏడాది జూలై 22వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్కసారి కూడా పార్లమెంట్ సమావేశల్లో పాల్గొనలేదు. అశోక్ గస్తీ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, రాష్ట్ర యువ మోర్చా, బీసీ కమిషన్ చైర్మన్, రాజ్యసభ ఎంపీగా ఎదిగారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు