పీఎం భూమి పూజకు హాజరు రాజ్యాంగ విరుద్ధం : అసదుద్దీన్

ప్రధానమంత్రి కార్యాలయం గత సోమవారం ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరగబోయే రామమందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కానున్నారని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.

అయితే తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ విషయంపై స్పందించారు.

అధికార పదవిలో ఉంటూ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.ఒకే మతానికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ షెడ్యూల్ ను ప్రధాని కార్యాలయం విడుదల చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

అయోధ్య భూమిపూజ కార్యక్రమానికి అధికార హోదాలో ఉన్న ప్రధాని హాజరుకావడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.పదవి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చేసిన రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించారని ఎంసీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీటర్ లో పేర్కొన్నాడు.

Advertisement

భారత రాజ్యాంగంలో లౌకికవాదం పునాది లాంటిదని,400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును ఓ నేరస్థుల సమూహం 1992లో కూల్చివేసింది.ఈ విషాదకర సంఘటన ఎప్పటికి మర్చిపోలేనిదని ఎంపీ అసదుద్దీన్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.అయోధ్యలో రామ మందిరం నిర్మాణ కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే ప్రముఖులను ఆహ్వానించింది ఆలయ ట్రస్ట్.ఆగస్టు 5న తెల్లవారుజామున భూమి పూజ కార్యక్రమం జరుగనుంది.

నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?
Advertisement

తాజా వార్తలు