తాప్సి-కంగనా మధ్య మాటల యుద్ధం! ఒకరిపై ఒకరు విమర్శలు

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

కొంత మంది సెలబ్రెటీ స్టార్స్ నెపాటిజంకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మరికొంత మంది నెపోటిజం అనేది ఎక్కడైనా ఉంటుందని, సెలబ్రెటీలు తమ పిల్లలని వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.

అయితే బంధుప్రీతి అనేది ఎక్కడైనా ఉండేదే అయినా టాలెంటెడ్ నటులకి వచ్చే అవకాశాలని కూడా బంధుప్రీతి ఉపయోగించుకొని కొందరు సొంతం చేసుకొని టాలెంటెడ్ నటులకి అవకాశాలు లేకుండా, ఎదగనీయకుండా చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.అయితే బాలీవుడ్ లో తాప్సి, కాంగానా రనౌత్ ఇద్దరు నెపోటిజం బాధితులే.

ఇద్దరూ కూడా దీనికి వ్యతిరేకంగా తన గొంతు వినిపిస్తున్నారు.అయితే వీరి మధ్య మళ్ళీ మాటల దాడి ఎక్కువైంది.

ఈ మధ్య తాప్సి సోలోగా బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.కాంగానా స్టార్ హీరోయిన్ అయిపోయి తన రేంజ్ పెంచుకుంది.

Advertisement

ఇద్దరు ఒకే దారిలో వెళ్తున్న వారే అయినా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి.ఈ నెపోటిజం విషయంలో కూడా ఇద్దరు తమ మధ్య ఉన్న విభేదాలు చూపించుకుంటున్నారు.

ఇటీవల తాప్సీ తాను నెపోటిజం బాధితురాలిని అంటూ చేసిన వ్యాఖ్యలపై కంగన స్పందిస్తూ సినీ నేపథ్యం లేకుండా వచ్చినవారు కూడా మూవీ మాఫియా దృష్టిలో మంచిగా ఉండాలనుకుంటున్నారని వ్యాఖ్యానించింది.తాప్సీ నిన్ను చూసి సిగ్గుపడుతున్నామని పోస్ట్ చేసింది.

ఈ వ్యాఖ్యలపై తాప్సీ స్పందిస్తూ కొందరు వ్యక్తులు మంచిలో కూడా చెడును చూస్తారని వ్యాఖ్యానించింది.అలాంటి వారి పట్ల కూడా మనం మంచిగానే ఉండాలని వారి గురించి ప్రార్థనలు చేద్దామని చెప్పింది.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు