రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.సుశాంత్ ఆత్మహత్యతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కి పడింది.

అయితే తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన సుశాంత్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.కాగా గతకొంత కాలంగా సరైన సినిమా ఛాన్సులు రాకపోవడంతోనే సుశాంత్ తీవ్ర మనస్థాపానికి గురైనట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

అయితే సుశాంత్ నటించిన ‘దిల్ బిచారా’ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఆయన మృతి చెందడంతో చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతి చెందింది.అయితే సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆయన ఫ్యాన్స్‌కు కాస్త ఊరటనిచ్చే విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది.

దిల్ బిచారా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్‌ను ఫిక్స్ చేసింది.ప్రస్తుతం థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఈ సినిమాను డిస్నీ హాట్‌స్టార్‌లో జూలై 24న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Advertisement

ఇక ఈ సినిమాను పూర్తి రిమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించింది.ముఖేష్ చాబ్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన సంజనా సాంఘీ హీరోయిన్‌గా నటిస్తోండగా అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు ఖచ్చితంగా హిట్ చేయాలని భావిస్తున్నారు.మరి వారు తమ అభిమాన హీరో సినిమాను ఎంతమేర ఆదరిస్తారో చూడాలి.

ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేస్తోంది.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు