ఆ సినిమా మిస్ చేసుకున్నందుకు ఫీలవుతున్న రష్మిక ఫ్యాన్స్

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతుంది.

ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు, యంగ్ హీరో నితిన్ సరసన భీష్మ అనే సినిమాలతో అదిరిపోయే హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తోంది.

కాగా ఈ సినిమా షూటింగ్‌లో ఇంకా జాయిన్ కాని ఈ బ్యూటీ తాను వదులుకున్న ఓ సినిమాను గుర్తుకు చేసుకుని ఫీలవుతుందట.నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు జనం నీరాజనం పట్టారు.స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ ఎమోషన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకంది.

ఇక ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తుండగా బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత రష్మిక మందన్నను సంప్రదించారట చిత్ర యూనిట్.

Advertisement

కానీ ఈ తనకు సౌత్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ కారణంగా డేట్ అడ్జెస్ట్‌మెంట్స్ విషయంలో ఇబ్బంది ఉంటుందని ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట.అయితే ఇప్పుడు ఆ సినిమాలో నటిస్తే బాగుండేది అని ఆమె ఫీల్ అవుతోందట.

జెర్సీ సినిమాను ఇటీవల చూసిన ఆమె సినిమా కంటెంట్‌కు బాగా కనెక్ట్ అయ్యిందట.దీంతో ఈ సినిమాను అనవసరంగా వదులుకున్నానని బాధపడుతోందట.

ఏదేమైనా సినిమాను వదులుకున్న సమయంలో లేని బాధ ఇప్పుడు ఎందుకు అని పలువురు కామెంట్ చేస్తున్నారు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు