సరిలేరు నీకెవ్వరు క్లోజింగ్ కలెక్షన్స్.. అదరగొట్టిన మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీపై మొదట్నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా టీజర్స్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు రిలీజ్ రోజునే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు.

ఇక పోటీలో మరో సినిమా ఉన్నప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది.ఈ సినిమా మహేష్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ కలెక్ట్ చేసిన మూవీగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇక ఈ సినిమా ఇటీవల 50 రోజులు కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమా టోటల్ రన్‌ను ముగించుకోవడంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.129.98 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది.ఇప్పటికే ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫాంపై రిలీజ్ కావడంతో ఈ సినిమా థియేటర్‌ల నుండి తీసేశారు.

Advertisement

కాగా మహేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో కేమియో పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఏరియాల వారీగా ఈ చిత్రం టోటల్ రన్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 34.15 కోట్లు సీడెడ్ - 14.85 కోట్లు గుంటూరు - 10.05 కోట్లు ఉత్తరాంధ్ర - 19.59 కోట్లు ఈస్ట్ - 11.85 కోట్లు వెస్ట్ - 7.20 కోట్లు కృష్ణా - 8.85 కోట్లు నెల్లూరు - 4.05 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 109.59 కోట్లు కర్ణాటక - 7.55 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 1.95 కోట్లు ఓవర్సీస్ - 10.89 కోట్లు టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ - 129.98 కోట్లు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు