సరిలేరు నీకెవ్వరు 37 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్లు.. ఎంతంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాకు తొలిరోజే అన్ని చోట్ల అదిరిపోయే టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్లు కూడా సూపర్‌గా వచ్చాయి.

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడ్డారు.మహేష్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు అనిల్ రావిపూడి టేకింగ్, రష్మిక అందాల ఆరబోతతో పాటు కామెడీ టైమింగ్ తోడవ్వడంతో ఈ సినిమా క్లాస్, మాస్ అని తేడా లేకుండా ప్రేక్షకులను అలరించింది.

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశం.ఈ సినిమాలోని పాటలు, ఫైట్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా కలెక్షన్ల జోరు ఇంకా కొనసాగుతోంది.రిలీజ్ అయ్యి 37 రోజుల ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.138.16 కోట్ల వసూళ్లను సాధించింది.బన్నీ అల వైకుంఠపురములో సినిమా పోటీలో ఉన్నా ఈ సినిమా మాత్రం కొన్ని వర్గాల ప్రేక్షకులను ఇంకా అలరిస్తూ ఉంది.

ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర 37 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 39.74 కోట్లు సీడెడ్ - 15.60 కోట్లు గుంటూరు - 9.95 కోట్లు ఉత్తరాంధ్ర - 19.83 కోట్లు ఈస్ట్ - 11.36 కోట్లు వెస్ట్ - 7.45 కోట్లు కృష్ణా - 8.90 కోట్లు నెల్లూరు - 4.05 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 116.88 కోట్లు కర్ణాటక - 7.52 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 1.81 కోట్లు ఓవర్సీస్ - 11.95 కోట్లు టోటల్ వరల్డ్‌వైడ్ - 138.16 కోట్లు.

Advertisement
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

తాజా వార్తలు