పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు నాట్స్ చేయూత

గుంటూరు: ఫిబ్రవరి 7: అమెరికాలో తెలుగు వారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది.

భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదానికి తగ్గట్టుగా పేదలకు సేవ చేయటం లో నాట్స్ మరో ముందడుగు.

గుంటూరులో స్థానిక అరండల్ పేట 10 వ లైన్ లో హోటల్ జయ గ్రాండ్ లో మహిళా సాధికారత కోసం 150 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది.దీంతో పాటు 30 రోజులు మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇప్పిస్తోంది.

ఈ కార్యక్రమం లో తల్లం రత్న కుమారి కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చారు గుంటూరులో ఈ టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ప్రారంభించారు.రోబోజ్ఞాన్ సీ.ఈ.ఓ.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.హిందూ ఇంజనీరింగ్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ మల్లిఖార్జున రావు పాల్గొని ఈ కార్యక్రమ ప్రాధాన్యతను అందరికీ తెలియచేసారు.

సమాజ చైతన్య సంఘం అధ్యక్షులు గుంటూరు పరిశుద్ధ రావు, సమాజ సేన సీతారాం ఆర్ధ్వర్యం లో మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇప్పించినందుకు శుభాభినందనలు తెలియచేసారు.

Advertisement

ఇండియా పర్యటనలో ఉన్న నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఈ రోజు గుంటూరు లో మహిళలు స్వశక్తితో ఆర్థికంగా నిలబడేందుకు ఇలాంటి కుట్టు శిక్షణ ఎంతో దోహదం చేస్తుందన్నారు.పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూత అందించాలనే నాట్స్ ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టిందన్నారు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు