లాంగ్ మార్చ్ విషయంలో వెనక్కి తగ్గిన బీజేపీ-జనసేన! అసలు కారణం ఇదేనా

ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ-జనసేన కూటమి భవిష్యత్తు కార్యాచరణపై ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది.

ఇప్పటికే ఉద్యమాలు, పోరాటం కూడా ఉమ్మడిగా చేయాలని నిర్ణయించుకున్నారు.

దీనికి తగ్గట్లుగానే కేంద్ర పెద్దలతో మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర బీజేపీ పెద్దలతో కలిసి సమావేశాలు అవుతున్నారు.అయితే ప్రస్తుతం అమరావతి రాజధాని ఉద్యమంలో బీజేపీ, జనసేన మధ్య కొంత గ్యాప్ ఉందని చెప్పాలి.

ఈ గ్యాప్ ని కూడా సరి చేసుకునే పనిలో రెండు పార్టీల నేతలు పడ్డారు.ఇదిలా ఉంటే ఇప్పటికే అమరావతి రాజధాని రైతుల కోసం ఫిబ్రవరి 2న లాంగ్ మార్చ్ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకొని, బీజేపీ నేతలతో సిద్ధమయ్యారు.

ఇదిలా ఉంటే ఉన్నపళంగా ఈ లాంగ్ మార్చ్ ని వాయిదా వేస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు.దీనిపై తమ తదుపరి నిర్ణయం ఏంటి అనేది తెలియజేస్తామని క్లారిటీ ఇచ్చేశారు.

Advertisement

అయితే లాంగ్ మార్చ్ చేస్తామని ప్రకటించి ఇప్పుడు ఉన్నపళంగా ఇలా వెనక్కి తగ్గడం వెనుక కారణం ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ జనసేనతో కలిసి ప్రయాణం చేస్తున్న అంతర్గతంగా వైసీపీ మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉందనే టాక్ రాజకీయ వర్గాలలో ఉంది.

ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు బీజేపీ-జనసేన పొత్తు తర్వాత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు తప్ప బీజేపీని ఒక్క మాట అనడం లేదు.ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం అమరావతిలో రైతులు ఉన్న పరిస్థితిలో లాంగ్ మార్చ్ చేస్తే అది శాంతి భద్రతలకి ప్రమాదంగా మారే అవకాశం ఉందని వైసీపీ భావించడం, దీనిపై కేంద్రంలోని పెద్దలకి తెలియజేయడం జరిగిందని చెప్పుకుంటున్నారు.

ఈ నేపధ్యంలోనే ఈ టైంలో లాంగ్ మార్చ్ కరెక్ట్ కాదని కేంద్రం నుంచి పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి వచ్చి ఉంటుందనే టాక్ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు