ఎన్టీఆర్ కు నా కథను వినిపించిన మాట వాస్తవం...కానీ ఎన్టీఆర్

తమిళ దర్శకుడు మురగదాస్ ప్రస్తుత్తం సూపర్ స్టార్ రజినీకాంత్ తో దర్బార్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తెలుగు,తమిళంలో విడుదలకానున్నది.

మురగదాస్ కి తెలుగు హీరోస్ మరియు తెలుగు అభిమానుల మీద ప్రేమ పోలేదు అనే చెప్పాలి ఎప్పుడు ఏదో ఓ న్యూస్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాడు.ఆ మద్య మహేష్ బాబు తో స్పైడర్ అనే చిత్రాన్ని రూపొందించి తమిళ ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

కానీ తెలుగు ఆడియన్స్ పల్స్ తెలుసుకోవడంలో విపలం అయ్యాడని చెప్పాలి.ఈ మద్య మురగదాస్ ఓ ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీఆర్ గురుంచి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఎన్టీఆర్ తో ఓ మంచి సినిమా చెయ్యాలనేది నా కల ఆ కలను నిజం చేసుకోవడానికి ఓ సారి ఎన్టీఆర్ కి నా కథను వినిపించాను కానీ అది ఫైనల్ కాలేదు.ఎన్టీఆర్ తో నా సినిమా ఉండబోతున్నది అనేది ఆవాస్తవం.నేను ఎన్టీఆర్ ని కలిసి కుడా చాలాకాలం అయింది.

Advertisement

అన్ని కుదిరితే మాత్రం ఎన్టీఆర్ తో తప్పకుండ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా తీస్తాను.మహేష్ బాబు విషయంలో జరిగిన తప్పును ఎన్టీఆర్ విషయంలో జరగకుండా చూసుకుంటాను అన్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుత్తం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.ఆ తరువాత, ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో సినిమా అనే వార్తలు వస్తున్నాయి.

ఆ తరువాత మురగదాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ ఉంటుందనే ఉహాగానాలు ఉన్నాయి.త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి .

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు