రివ్యూ : 90ఎంఎల్‌ ఏ స్థాయి కిక్కిస్తుంది

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న కార్తికేయ ఆ తర్వాత వరుసగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఆమద్య నాని గ్యాంగ్‌లీడర్‌ చిత్రంలో విలన్‌గా నటించిన కార్తికేయ నటుడిగా కూడా మంచి పేరు దక్కించుకున్నాడు.

అలాంటి కార్తికేయ నటించిన ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి కూడా అందరి దృష్టి ఆకర్షిస్తూ వచ్చింది.మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

కార్తికేయ కొన్ని కారణాల వల్ల చిన్నతనం నుండే ఆల్కాహాల్‌ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.అనారోగ్యం కారణంగా చిన్నతనంలోనే తల్లి టానిక్‌ ఇచ్చినట్లుగా మందును కార్తికేయకు ఇస్తుంది.

ఆల్కహాల్‌ తీసుకోకుంటే చనిపోయే పరిస్థితి.అలాంటి కార్తికేయ నేహాను ప్రేమిస్తాడు.

Advertisement

నేహా తండ్రి రావు రమేష్‌కు మద్యం అంటే మహా చిరాకు.మందు తాగేవాళ్లంటే అసహ్యం.

అలాంటి ఆయన్ను కార్తికేయ ఎలా ఒప్పించాడు, తన మద్యం అలవాటు కారణంగా కార్తికేయ ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ అనేది సినిమా చూసి తెలుసుకోండి.

నటీనటుల నటన :

కార్తికేయ మొదటి సినిమాతోనే మాస్‌ ఆడియన్స్‌ పల్స్‌ పట్టుకున్నాడు.ఆడియన్స్‌కు ఎలా ఉంటే నచ్చుతుందనే విషయం అతడికి అర్థం అయ్యింది.

అందుకే ఆ తరహాలోనే ఈ సినిమాలో నటించాడు.ఒక విచిత్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునేందుకు తాపత్రయపడే అబ్బాయి పాత్రలో కార్తికేయ ఆకట్టుకున్నాడు.

ఇక హీరోయిన్‌ మంచి నటనతో మెప్పించింది.పక్కింటి అమ్మాయి తరహాలో ఈమె ఉంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
షారుఖ్ కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిన పవన్.. కారణాలివే!

ఆమె నటన కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉంది.అయితే హీరో హీరోయిన్‌ మద్య ఇంకాస్త రొమాంటిక్‌ సీన్స్‌ ఉంటే బాగుండేది.

Advertisement

ఇతర నటీనటులు వారి పాత్రల పరిధిలో నటించారు.

టెక్నికల్‌ :

అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సినిమాకు ప్లస్‌ కాలేదు.ఆయన పాటలు ఒకటి రెండు కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.కాని ఎక్కువ శాతం ఆయన పాటల వల్ల సినిమాకు హైప్‌ వచ్చింది లేదు, సినిమాలో కూడా పెద్దగా ఆకట్టుకున్నది లేదు.

ఇక ఆయన ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఎక్కువ సీన్స్‌లో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సీన్స్‌ స్థాయిని పెంచే విధంగా ఉంది.

ఇక సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.కొన్ని యాక్షన్‌ సీన్స్‌ కు సంబంధించి సినిమాటోగ్రఫీ మెప్పించింది.

దర్శకుడు విభిన్నమైన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి పర్వాలేదు అనిపించాడు.ఇక నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా ఉన్నాయి.

ఎడిటింగ్‌లో చిన్న చిన్న జర్క్‌లు ఉన్నాయి.స్క్రీన్‌ప్లే ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటే బాగుండేది.

విశ్లేషణ :

చాలా చిన్న స్టోరీ లైన్‌ అయినా దాన్ని దర్శకుడు ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందించేందుకు ప్రయత్నించాడు.కథను ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది.

ముఖ్యంగా సినిమాకు సంబంధించిన కొన్ని ఆల్కహాల్‌ సీన్స్‌ విభిన్నంగా ఉన్నాయి.దర్శకుడు ఎంచుకున్న కథను పూర్తి స్థాయిలో స్క్రీన్‌ప్లేతో చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు.

అయితే సినిమాకు సంబంధించి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇంకాస్త బెటర్‌గా ఉండి ఉంటే బాగుండేది.మొత్తంగా సినిమా మాస్‌ ఆడియన్స్‌ను ఒక స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఉంది.

ప్లస్‌పాయింట్స్‌ :

కొన్ని కామెడీ సీన్స్‌ యాక్షన్‌ సీన్స్‌ హీరో హీరోయిన్‌, స్టోరీ లైన్‌

మైనస్‌ పాయింట్స్‌ :

స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, పాటలు, కొన్ని బోరింగ్‌ కామెడీ సీన్స్‌ బోటమ్‌ లైన్‌ : 90 ఎంఎల్‌ కొందరికి మాత్రమే కిక్‌ ఇస్తుంది.

రేటింగ్‌ : 2.5/5.0

తాజా వార్తలు