కారు జోరు, సైదిరెడ్డి ఘన విజయం

తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన హుజూర్‌ నగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు క్లీయర్‌గా కనిపించింది.

కాంగ్రెస్‌ ప్రదేశ్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అక్కడ తన భార్య పద్మవతిని నిలబెట్టాడు.

తాను రాజీనామా చేసిన స్థానం కనుక ఈజీగా గెలిచేయొచ్చు అనుకున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడికి గట్టి షాక్‌ తలిగింది.ఊహించని పరాభవంను మూట కట్టుకున్నారు.

హుజూర్‌ నగర్‌ నియోజక వర్గం ఏర్పాటు అయినప్పటి నుండి కూడా అక్కడ ఉత్తమ్‌ జెండా ఎగరేస్తు వచ్చాడు.పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఉత్తమ్‌ గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.

దానికి ఉప ఎన్నికలు జరుగగా ఉత్తమ్‌పై ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి మళ్లీ పోటీ చేశాడు.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని బలంగా ఢీ కొట్టిన సైదిరెడ్డి ఈసారి గెలవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు.

Advertisement

ఆయన చేసిన ప్రయత్నం సఫలం అయ్యింది.ఏకంగా 43 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఈ విజయంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయి నమ్మకం ఉందో అర్థం అయ్యిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.ఈ ఓటమిని కాంగ్రెస్‌ నేతలు అస్సలు ఊహించలేదు.

దాంతో వారంతా కూడా అవాక్కయ్యి ఉండిపోయారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు కనిపించింది.

ఇప్పుడు హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో ఆ జోరు కంటిన్యూ అయ్యిందని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు