పవన్ సారూ ! ఆయన్నేనా మిగతావారిని పట్టించుకోరా ?

ఏపీలో ఎన్నికల తంతు ముగిసిన తరువాత జనసేన ఊసే లేకుండా పోయింది.ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయారు.

అయితే పవన్ తానా సభలకు అమెరికాకు వెళ్లి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ స్పీడ్ పెంచారు.పార్టీలో వివిధ కమిటీలు ఏర్పాటు చేసి కొంతమందికి పదవులు కూడా కట్టబెట్టారు.

ఈ పదవుల్లో పలానా వారికి అన్యాయం జరిగింది అని పెద్ద ఎత్తున విమర్శలు కూడా చెలరేగాయి.ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జనసేనలో మరో అసంతృప్తి చెలరేగింది.

ఆ పార్టీలో పవన్ తరువాత నెంబర్ 2 గా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ పై ఇప్పుడు ఇంతా బయటా విమర్శలు చెలరేగుతున్నాయి.ఈ విషయంలో పవన్ తీరును ఆ పార్టీ నేతలు కూడా తప్పుపడుతున్నారు.

Advertisement

పవన్ ఎక్కడికి వెళ్లినా నాదెండ్ల మనోహర్ ను మాత్రమే తీసుకువెళ్తూ మిగతావారిని పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు.

తాజాగా ఇదే అంశంపై జనసేన మాజీ నాయకుడు అద్దేపల్లి శ్రీధర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.దీనిపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.నాయకుడు అనేవాడు ప్రతి ఒక్కరిని ముందుండి నడిపించాలని, కేవలం ఒకరిద్దరికి అధిక ప్రాధాన్యం ఇచ్చి మిగతా వారిని పట్టించుకోకపోవడం సరికాదు అంటూ విమర్శలు గుప్పించారు.

అంతే కాదు పార్టీ నాయకుల పేర్లు కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ, తోట చంద్రశేఖర్, భరత్ భూషణ్, శేఖర్ పులి,ఇలా చాలామంది నాయకులు ఉన్నారని, వారిని కూడా పవన్ పట్టించుకోవాలని శ్రీధర్ హితబోధ చేశారు.

వారిని విస్మరిస్తే మూల్యం చెల్లించే తప్పిదమవుతుందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ మీద కూడా అద్దేపల్లి శ్రీధర్ విమర్శలు గుప్పించారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

జనసేనలో నెంబర్ 2గా భావిస్తున్న కీలక నాయకుడు తన తండ్రిని మాత్రం ప్రభావితం చేయలేకపోయారు అంటూ ఆయన మనోహర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.మనోహర్ తండ్రి భాస్కర రావు బిజెపిలో చేరకుండా ఎందుకు అడ్డుకోలేకపోయారు అంటూ ప్రశ్నించారు.

Advertisement

ప్రస్తుతం శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద వైరల్ గా మారాయి.ఆయన పార్టీలో జరుగుతున్న విషయాన్నే చెప్పారని పార్టీలో కొంతమంది చర్చించుకుంటున్నారు.

ఇక అద్దె పల్లి శ్రీధర్ విషయానికి వస్తే ఆయన ఎన్నికల ముందు బీజేపీ నుంచి జనసేనలో చేరారు.కానీ ఆ తరువాత పార్టీలో పరిణామాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసారు.

అయితే ఏ పార్టీలోనూ చేరకుండా ఉండిపోయారు.

తాజా వార్తలు