'కారు' వెనుకే సైకిల్ : జనవరిలో టీడీపీ అభ్యర్థుల ప్రకటన ...?

కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలుపెట్టేసింది.దీంతో అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా గెలుపు ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి.

ఈ ఎన్నికల రేసులో అందరికంటే ముందు ఉండాలనే కంగారులో టిడిపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నాడు.అందుకే.

అందరికంటే ముందుగానే మేల్కొన్నాడు చంద్రబాబు.ఇప్పటికే తెలంగాణాలో ఎన్నికల్లో పరాజయం పాలవ్వడంతో ఏపీ ఎన్నికల్లో ఆ తప్పు జరగకుండా.

ఉండాలని పంతాలు పట్టింపులు పక్కనపెట్టి మరీ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఫాలో అయిపోవాలని బాబు ఫిక్స్ అయిపోయాడు.అందుకే తెలంగాణ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రకటించినట్టుగానే అభ్యర్థుల లిస్ట్ ముందుగా ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నాడు.

Advertisement

తెలంగాణ ఎన్నికల్లో ప్రజకూటమి ఘోరంగా విఫలం కావడానికి అభ్యర్థుల లిస్ట్ ప్రకటించకుండా చివరివరకు తాత్సర్యం చెయ్యడంతో అక్కడ చేదు ఫలితాలు ఎదురయ్యాయని బాబు నమ్ముతున్నాడు.

అందుకే తెలంగాణాలో కేసీఆర్ ప్రకటించినట్టే.ఏపీలో కూడా టీడీపీ అభ్యర్థుల లిస్ట్ ముందుగానే ప్రకటించేందుకు బాబు సిద్ధం అవుతున్నాడు.అది కూడా కాస్త ముందస్తుగా.

జనవరిలోనే వంద స్థానాలకు అసెంబ్లీ అభ్యర్థుల్ని ఖరారు చేస్తానని చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు.వాస్తవంగా చూస్తే.

చంద్రబాబు టిక్కెట్లు ఖరారు చేసే విధానం చాలా .భిన్నంగా ఉంటుంది.నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకూ అది సాగుతూనే ఉంటుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

కానీ మారిన రాజకీయ పరిస్థితులు.ఏపీలో ముక్కోణపు పోటీ ఇవన్నీ పరిగణలోకి తీసుకుని బాబు ఇలా ముందస్తుగా అభ్యర్థుల ప్రకటనకు సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.

Advertisement

ఆ ప్రకటించే వందమంది అభ్యర్థులు కూడా .ఆయా నియోజకవర్గాల్లో తప్పనిసరిగా గెలుస్తారు అనుకున్నవారినే ఎంపిక చేయాలనీ బాబు ప్లాన్.

గత ఎన్నికల్లో టీడీపీ తరపున 102 మంది గెలిచారు.వీరిలో 30 నుంచి 40 మందికి టిక్కెట్లు నిరాకరిస్తామని చెబుతున్నారు.వీరు కాకుండా.

వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉన్న మిగతా నియోజకవర్గాలు కలిపి ఓ వంద స్థానాల్లో చంద్రబాబు అభ్యర్థుల్నిగుర్తించారు.వీరందిరి పేర్లు ముందుగానే ప్రకటిస్తే ఆయ ఆనియోజకర్గాల్లో ఉన్న చిన్నపాటి వివాదాలను కూడా సరిచేసుకుని ముందుకు వెళ్లేందుకు బాగుంటుందని బాబుకి అనేక సూచనలు అందాయి.

అలాగే.ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో పొత్తులు గురించి పట్టించుకోకుండా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్దులను ఎంపిక చేసుకుని కేసీఆర్ ఏ విధంగా అయితే.

రాజకీయంగా దూకుడుగా వెళ్లారో అదే దూకుడుగా ముందుకు వెళ్లాలని బాబు ఆలోచన చేస్తున్నాడు.ఇక కాంగ్రెస్ పార్టీతో పొత్తు తెలంగాణాలో వర్కవుట్ కాకపోవడంతో .ఏపీలో ఆ విషయంలో ఏం చెయ్యాలో .అనే డైలమా ప్రస్తుతం టీడీపీలో కనిపిస్తోంది.

తాజా వార్తలు