భర్తపై తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న భార్య...ఎందుకో తెలుస్తే ఆశ్చర్యపోతారు.! వీళ్ళ రూటే సపరేటు..!

సాధారణంగా ఎన్నికల్లో అన్నదమ్ములు, మామా-అల్లుళ్లు, బావ-బావమరిది ఇలా పోటీ చేస్తుండటం చూస్తుంటాం.కానీరాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

అయితే ఒకే అసెంబ్లీ స్థానం నుంచి భార్యాభర్తలు బరిలోకి దిగారు.పోటీలాంటివి వీరి మధ్య లేకున్నా.

భార్యాభర్తలు ఒకే స్థానంలో బరిలోకి దిగడం ఆసక్తికర అంశమే.ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలోకి దిగుతున్నారు.

దానికి వారు చెప్పిన కారణం ఆశ్చర్యంగా ఉంటుంది.

Advertisement

స్వరూప్‌ చంద్‌ గెహ్లాట్‌ (55), మంజులత గెహ్లాట్‌ (52) భార్యాభర్తలు.స్వరూప్‌ చంద్‌ 1988 నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.తాజాగా మరోసారి బికనీర్‌ ఈస్ట్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.

అయితే ఈ ఎన్నికల్లో మంజులత కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.దీంతో ఒకే సీటు కోసం భార్యాభర్తలు పోటీచేస్తున్నారని రాజస్థాన్‌ రాష్ట్రం మొత్తం మార్మోగిపోయింది.

30 ఏళ్ల నుంచి ఎన్నికల్లో నిలబడి ఓడిపోయానా… అని ఏనాడూ నిరాశ చెందలేదు.కాని తన ఎన్నికల ప్రచారానికి తన భార్య రావడం లేదని బాధ పడేవాడు.ఎన్ని సార్లు రమ్మని అడిగినా మంజులత మాత్రం ప్రచారానికి వచ్చేది కాదు.

దీంతో ఈ సారి ఒక అద్భుతమైన ఐడియాను ప్రయోగించాడు.తనతో పాటు తన భార్యతో కూడా నామినేషన్ వేయించాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇద్దరూ బికనీర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.‘నేను గెలిస్తే భర్త సహకారం తీసుకుంటా.

Advertisement

నా భర్త గెలిస్తే ఆయన వెన్నంటే ఉంటా.ప్రచారానికి వెళ్లినా ఇద్దరం ఒకేసారి బయటకువెళ్తాం’ అని మంజులత చెప్పారు.

ప్రతీ రోజు ఉదయం ఇద్దరూ స్కూటర్‌పై కలిసే వెళ్తున్నారు.ఇద్దరిలో ఎవరికి ఓటేసినా ఓకే అని.ఎవరు గెలిచిన ఇంకొకరికి సహకరిస్తామని ఓటర్లకు చెబుతున్నారు.వీరి స్టోరీ మీడియాలో రావడంతో ఒక్క సారిగా బికనీర్‌లో చర్చనీయాంశంగా మారారు.

ప్రస్తుతం బికనీర్‌లో ఈ భార్యాభర్తల స్టోరీనే హాట్ టాపిక్‌గా మారింది.

తాజా వార్తలు