బాబూ .. జగన్ పిలుస్తున్నాడు స్పందిస్తాడా..

కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు ఏదో సాధిస్తారని అందరూ అనుకున్నారు.

కానీ దానివల్ల పెద్దగా ఏమీ కాకపోయినా ఇప్పుడు ఆ వ్యవహారం అటు తిరిగి ఇటుతిరిగి బాబు మెడకే చుట్టుకోబోతోంది.

టీడీపీ పార్లమెంటులో విఫలమైన పరిస్థితిని గుర్తించి జగన్‌ దాని తనకు అవకాశంగా మలుచుకునే పనిలో పడ్డాడు.గోదా విషయంలో పోరాడేందుకు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి రావాలని , మనం అంత కలిసి పోరాడితే హోదా ఎందుకు రాదో చూద్దామని జగన్ పిలుపు ఇవ్వడం జనాల్లోకి బాగా వెళ్ళింది.

ఈ వ్యవహారంలో బాబు కంటే జగన్ చిత్తశుద్ధితో ఉన్నాడని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

ఏపీపై కేంద్ర వైఖరికి నిరసనగా, టీడీపీ ఎంపీల రాజీనామాపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ ఈనెల 24న రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.అన్ని పార్టీలు, సంఘాలు, వ్యాపారులు తమ బంద్‌కి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.మీరు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.

Advertisement

ఇప్పుడైనా టీడీపీ ఎంపీలందరితో రాజీనామా చేయించి నిరాహారదీక్షలో కూర్చోబెట్టండి.రాజీనామా చేసిన మా ఎంపీలనూ పంపుతాను.

దేశమంతా ఇటే చూస్తుంది.హోదా ఎందుకు రాదో చూద్దాం! అని జగన్ ఆనందంతో వైసీపీ మీద అందరిలోనూ నమ్మకం పెరిగింది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ చాలు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరు? ఆంధ్రరాష్ట్ర ప్రజల హక్కును తాకట్టుపెట్టే అధికారం కేంద్రం, చంద్రబాబుకు ఎవరిచ్చారు? అని జగన్‌ ప్రశ్నిస్తున్నారు.రాహుల్‌ గాంధీ ఏపీ గురించి లోక్‌సభలో అర నిమిషం కూడా మాట్లాడలేదని జగన్‌ తెలిపారు.

తిరుపతి ఎన్నికల సభలో ఐదేళ్లు కాదు, ఏపీకి పదేళ్లు హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చిన మోడీ తర్వాత మోసం చేశారన్నారు.హోదాపై సంతకం పెట్టేవారికే వచ్చేసారి తమ మద్దతు ఉంటుందని, ఈ విషయంలో చంద్రబాబు తమతో కలసి రావాలని ఆయన పిలుపునిస్తున్నారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు