రంగస్థలం 100 డేస్‌.. మెగా ఫ్యాన్స్‌ నిరాశ

ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను దక్కించుకున్న చిత్రం ‘రంగస్థలం’.నాన్‌ బాహుబలి రికార్డును కూడా సొంతం చేసుకుంది.

దాదాపు 125 కోట్ల షేర్‌ను దక్కించుకుని బాహుబలి తర్వాత స్థానంను సంపాదించడంతో పాటు ఏకంగా 15 థియేటర్లలో ఈ చిత్రం నేరుగా వంద రోజులు ప్రదర్శితం అయ్యింది.ఈమద్య కాలంలో వంద రోజులు ఒక సినిమా ఆడటం అనేది అసాధ్యం అయ్యింది.

బాహుబలి వంటి సినిమా కూడా వంద రోజులు ఆడలేని పరిస్థితి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉంది.రెండు మూడు వారాల కంటే ఎక్కువగా ఏ చిత్రాలు కూడా ఆడటం లేదు.

ఇలాంటి సమయంలో రంగస్థలం చిత్రం ఏకంగా 100 రోజులు 15 థియేటర్లలో పూర్తి చేసుకోవడం అది పెద్ద రికార్డుగా చెప్పుకోవచ్చు.ఈ దశాబ్దంలో ఇంత భారీ రికార్డును ఏ ఒక్క సినిమా దక్కించుకోలేక పోయింది.ఇంతటి భారీ విజయాన్ని వేడుకగా నిర్వహించుకోవాలని మెగా ఫ్యాన్స్‌ కోరుకున్నారు.కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు జల్లారు.100 రోజుల వేడుకను సింపుల్‌గా కానిచ్చేశారు.వంద రోజులు వేడుక భారీగా జరపాలని మొదట భావించినప్పటికి చివరి నిమిషంలో కేవలం మీడియా మిత్రులు మరియు కొద్ది మంది ఫ్యాన్స్‌ సమక్షంలోనే జరిపారు.

Advertisement

ఎందుకు ఇలా చేశారు అనే విషయమై క్లారిటీ లేదు.‘రంగస్థలం’ చిత్రం మెగా ఫ్యాన్స్‌కు పెద్ద పండగ.కాని ఫ్యాన్స్‌కు ఆ పండగను దూరం చేశారు.

వంద రోజులు సినిమా ఆడిన నేపథ్యంలో భారీ ఎత్తున వేడుక నిర్వహించాలని మొదట భావించి, ఆ తర్వాత ఎందుకు వెనక్కు తగ్గారు అనే విషయంపై కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది.త్వరలోనే కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా ఎంట్రీ కాబోతున్న ‘విజేత’ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించబోతున్నారు.

ఆ వేడుకలో ఫ్యాన్స్‌ను పెద్ద ఎత్తున పాల్గొనేలా చేస్తున్నారు.అందుకే వారం గ్యాప్‌లోనే మెగా వేడుకల వల్ల ఫ్యాన్స్‌ ఇబ్బందులు పడతారని, రంగస్థలం వంద రోజుల వేడుకకు హాజరు అయిన వారు కళ్యాణ్‌ ‘విజేత’ మూవీ వేడుకకు హాజరు కాకపోయే అవకాశం ఉందని, అందుకే స్వయంగా చరణ్‌ మరియు ఇతర మెగా ఫ్యామిలీ రంగస్థలం భారీ వేడుక వద్దన్నట్లుగా తెలుస్తోంది.

ఫ్యాన్స్‌ మాత్రం ఈ విషయంలో తీవ్రంగా నిరాశను వ్యక్తం చేస్తున్నారు.తాము ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 100 రోజుల వేడుకను ఇలా సాదా సీదాగా ముగించేయడం దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

ఇలాంటి సందర్బం మరోటి రాకపోవచ్చు అని, అందరికి గుర్తుండేలా, అందరు గుర్తుంచుకునేలా 100 రోజుల వేడుకను నిర్వహిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు