మిస్ ఇండియా పోటీలో రన్నర్ అప్ గా నిలిచిన తెలుగు అమ్మాయి గురించి ఆసక్తికర విషయాలు ఇవే.!

తమిళనాడుకు చెందిన అనుకృతి‌వాస్ ఫెమినా మిస్ ఇండియా- 2018 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.మొత్తం 29 మంది ఫైనలిస్టులను వెనక్కినెట్టి, ఆమె ఈ ఘనత దక్కించుకున్నారు.

ముంబైలో జరిగిన ఎఫ్‌బీబీ కలర్స్ మిస్ ఇండియా-2018 కార్యక్రమంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్.ఫెమినా మిస్ ఇండియా- 2018 కిరీటాన్ని అనుకృతివాస్‌కు ధరింపజేశారు.

ఈ అందాల పోటీలో హర్యానాకు చెందిన మీనాక్షీ చౌదరి ఫస్ట్ రన్నరప్‌గా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రేయ సెకెండ్ రన్నరప్ గా నిలిచారు.అనుకృతి క్రీడాకారిణిగా, డాన్సర్‌గా పేరొందారు.

ఫ్రెంచ్ భాషలో బీఏ పూర్తి చేశారు.

Advertisement

రన్నర్ అప్ గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రేయా రావు కామవరపు(23) గురించి అసకథికార విషయాలు మనం తెలుసుకుందాము.ఆర్కిటెక్చర్ అయిన శ్రేయా.

ఓ స్నేహితురాలు పట్టుబట్టడంతో అడిషన్స్‌కు వెళ్లి మరీ ఈ అదృష్టాన్ని అందుకున్నారంట.అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం అందాల పోటీలనగానే ముందు భయపడ్డారని ఆమె చెబుతున్నారు.

‘అర్కిటెక్‌ అయిన నాకు మిస్‌ ఇండియా పోటీలకు యత్నించటం తొలుత కష్టంగానే అనిపించింది.ర్యాంప్‌ వాక్‌ అంటే ఏంటో నాకు అస్సలు తెలీదు.

పైగా మేకప్‌ వేసుకోవటం కూడా నాకు రాదు.దీనికితోడు అందాల పోటీలు అనగానే నా పెరెంట్స్‌ ఒక్కసారిగా భయపడ్డారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

వారిలో తెలీని ఏదో ఆందోళన.నా అడిషన్స్‌ అన్నీ చూశాక వాళ్ల అభిప్రాయం మారింది.

Advertisement

ఇది కేవలం ఒక్క అందాల పోటీలే కాదని, నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానన్న నమ్మకం వారికి ఏర్పడింది.అందుకే చివర్లో మంచి ప్రోత్సాహం అందించారు.

సాధ్యమైనంత వరకు నా వ్యవహారాలు నేనే చూసుకున్నా’ని ఆమె తెలిపారు."నా కల తీరాక తిరిగి నా ప్రొఫెషన్‌కు వెళ్లిపోతా.

విద్యాసంస్థలు నెలకొల్పటం నా కల.అది నెరవేరే దాకా కృషి చేస్తా.అంతేగానీ గ్లామర్‌ వరల్డ్‌లో మాత్రం అడుగుపెట్టదల్చుకోలేదు" శ్రేయా రావు స్పష్టం చేశారు.

తాజా వార్తలు