వారంలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది.ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తే కలిగే ప్రయోజనాలు కూడా వేరుగానే ఉంటాయి.
హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం ఒక్కో రోజు ఒక్కో దేవుడు అధిపతిగా ఉన్నారు.అందువల్ల ఆ రోజుకు అధిపతి అయినా దేవుణ్ణి పూజిస్తే ఆ దేవుని అనుగ్రహం ,ఏదైనా పని తలపెట్టినప్పుడు కార్య సిద్ది జరుగుతుంది.
సోమవారం శివునికి ఇష్టమైన రోజు.ఆ రోజు పాలు, బియ్యం, బెల్లంతో తయారుచేసిన పరమాన్నం నైవేద్యంగా పెడితే ఆ దేవదేవుని అనుగ్రహం పొందవచ్చు.
మంగళవారం నాడు ఆంజనేయుడినితోపాటు దుర్గాదేవిని పూజిస్తే మంచి జరుగుతుంది.ఆ రోజున రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ చెక్కలో దీపం వెలిగిస్తే అనుకున్న పనులకు ఎటువంటి విఘ్నాలు రావు.
బుధవారం నాడు గరికతో వినాయకుణ్ణి పూజిస్తే మనస్సులోని కోరికలు నెరవేరతాయి.
గురువారం నాడు విష్ణుమూర్తి, సాయిబాబాను పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి.
శుక్రవారం లక్ష్మి దేవిని పూజిస్తే సకల సంపదలు వస్తాయి.
శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆపదలు రాకుండా ఉంటాయి.