వచ్చే 3 నెలలు జాగ్రత్త.. వైద్య నిపుణులు హెచ్చరిక

కరోనా వైరస్ ఇంకా ప్రజలను వదిలిపెట్టడం లేదు.కరోనా వైరస్ సెకండ్ వేవ్ అంటూ వస్తున్న వార్తలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

 Corona Second Wave Will Start Shortly In India, Corona, Second Wave, Soon, Next,-TeluguStop.com

ఇప్పటికే కరోనా వల్ల ఆర్థికంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.లాక్‌డౌన్ వల్ల ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు.

జనజీవనం పూర్తిగా మారిపోయింది.ప్రజల జీవినవిధానంలో చాలామార్పులు వచ్చేశాయి.

కరోనా తగ్గుతుందని అనుకున్న సమయంలో త్వరలో సెకండ్ వేవ్ మొదలుకానుందని వైద్య నిపుణులు చెబుతున్న మాటలు ఆందోళనకంగా మారాయి.
వైరస్ ప్రభావం బాగా ఎక్కువై తగ్గిన తర్వాత మళ్లీ అది విజృంభిస్తోంది.

దానిని సెకండ్ వేవ్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు.చాలా దేశాల్లో ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ వల్ల భారీగా కేసులు పెరుగుతున్నాయని, త్వరలో ఇండియాలో కూడా సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల ఇండియాలో కేసులు బాగా తగ్గాయి.మరణాల రేటు కూడా బాగా తగ్గింది.
దేశవ్యాప్తంగా ఒకట్రెండు రాష్ట్రాల్లో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు తగ్గాయి.ప్రజలకు కూడా కరోనాతో కలిసి జీవించడం అలవాటైపోయింది.ఈ క్రమంలో సెకండ్ వేవ్ మొదలైతే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉంటారా అనేది ప్రశ్నగా మారిపోయింది.వైద్య నిపుణులు మాత్రం సెకండ్ వేవ్ వస్తుందని, వచ్చే మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
భౌతిక దూరాన్ని పాటించాలని, జలుబు, దగ్గు, జ్వరం, ఇతర లక్షణాలు ఉంటే వెంటనే కరోనా టెస్టు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.శీతాకాలం మొదలుకావడంతో సెకండ్ వేవ్ మొదలుకాబోతోందని, అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube