కువైట్ లో 80 మంది భారత నర్సుల నిర్భంధం..

కువైట్ లాంటి దేశాలకి వెళ్ళినప్పుడు అక్కడ నియమనిభంధనలకి అనుగుణంగా ఉండాలి తప్ప చిన్న పొరపాట్లు జరిగినా సరే ఎలాంటి వారినైనా వారి దేశంలోకి అడుగుపెట్టనివ్వరు.

అయితే వారి నిభంధనలకి అనుగుణంగా ద్రువపత్రాలు లేవని సుమారు 80 మంది భారతీయ నర్సులని గత రెండేళ్లుగా అక్కడి ఉద్యోగాలలో నియమించలేదు.

ఇంతకీ వారికి అక్కడ ఉద్యోగాలు ఇప్పించింది దళారులు కూడా కాదు భారత ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులే వీరందరినీ నియమించారు.

మొత్తం 80 మంది గ్రూపుగా ఉన్న మా బృందాన్ని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఎంపిక చేశారు మరి ఇలా ఎందుకు మా పరిస్థితి మారిపోయిందో అర్థం కావడం లేదు అంటూ ఆ బృందంలో ఒకరైన అఖిల కుమార్ తెలిపారు.మాతో పాటు ఎంపికైన వారు ఇప్పుడు భారత ప్రభుత్వం తరుపున ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నారని ఉద్యోగాలు లేక రెండున్నర సంవత్సరాల నుంచి ఆశతో ఎదురు చూస్తున్నామని వారు తెలిపారు.

దళారుల ద్వారా మోసపోకుండా నేరుగా ప్రభుత్వం కుబైట్ లోని సంస్థల ద్వారా ఈ ఎంపిక జరిగినా అవినీతి ఎక్కడో జరిగిందని దాంతో ఈ 80 మంది నష్ట పోయారని దీనికి కారణమైన వారిని తప్పకుండా శిక్షిస్తామని భర్త ప్రభుత్వం స్పష్టం చేసింది.అంతేకాదు కొన్ని రోజుల్లోనే 80 మందికి నియామక పత్రాలు అందుతాయని వారు ఆశాభావం వ్యక్తంచేశారు.

Advertisement
వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్
Advertisement

తాజా వార్తలు