దొడ్దిదారిన అమెరికా వెళ్లే యత్నం, ఆరుగురు భారతీయులు అరెస్ట్.. పోలీసులు రాకుంటే జలసమాధే

కొద్దివారాల క్రితం అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన డాలర్ డ్రీమ్స్‌పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది.

ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.

మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.తాజాగా ఇలాంటి ఆలోచనే చేసి కొద్దిలో మృత్యువు కోరల్లోంచి బయటపడి.

కటకటాల పాలయ్యారు ఆరుగురు భారతీయులు.కెనడా నుంచి అక్రమంగా అమెరికా వెళ్లే క్రమంలో వీరి పడవ మునిగిపోయింది.

Advertisement

పోలీసులు సమయానికి స్పందించి వీరిని రక్షించారు.యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.

సెయింట్ రెగిస్ మోహాక్ ట్రైబల్ పోలీస్ డిపార్ట్‌మెంట్, అక్వేసాస్నే మోహాక్ పోలీస్ సర్వీస్, హోగాన్స్‌బర్గ్ - అక్వెసాస్నే వాలంటీర్ ఫైర్ డిపార్ట్‌మెంట్ (హెచ్ఏవీఎఫ్‌డీ), మస్సేనా బోర్డర్ పెట్రోల్ ఏజెంట్ల సంయుక్త ఆపరేషన్‌లో గురువారం తెల్లవారుజామున ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.వీరిలో ఆరుగురు భారతీయ పౌరులు వున్నట్లు తెలిపింది.

వీరి వయసు 19 నుంచి 21 సంవత్సరాల మధ్య వుంటుందని యూఎస్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.వీరు చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.

పట్టుబడ్డ ఏడో వ్యక్తిని అమెరికా జాతీయుడిగా గుర్తించారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

గతవారం కెనడాలోని అంటారియో నుంచి ఓ పడవ అమెరికా వైపు ప్రయాణిస్తున్నట్లు , ఇందులో పలువురు వ్యక్తులు వున్నట్లు అక్వేసాస్నే మోహాక్ పోలీస్ సర్వీస్‌కు సమాచారం అందింది.దీంతో అప్రమత్తమైన అధికారులు.సెయింట్ రెగిస్ మోహాక్ ట్రైబల్ పోలీస్ విభాగానికి సమాచారం అందించారు.

Advertisement

వెంటనే స్పందించిన ట్రైబల్ పోలీస్ అధికారులు.అక్వేసాస్నేలోని సెయింట్ రెగిస్ నదిలో మునిగిపోవడాన్ని గుర్తించారు.

దీంతో బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు, హోగాన్స్‌బర్గ్ - అక్వెసాస్నే వాలంటీర్ ఫైర్ డిపార్ట్‌మెంట్ (హెచ్ఏవీఎఫ్‌డీ) సాయంతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

మునిగిపోతున్న పడవలోంచి ఒకరు క్షేమంగా తీరానికి చేరుకున్నారు.అయితే అప్పటికే పడవలో ప్రమాద ప్రాంతానికి వచ్చిన హెచ్ఏవీఎఫ్‌డీ సిబ్బంది ఆరుగురిని రక్షించారు.వైద్య చికిత్స అనంతరం బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు వారిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు ఆ ప్రాంతానికి సరైన సమయానికి వెళ్లకపోతే.వారంతా జల సమాధి అయ్యే వారే.

మానవ అక్రమ రవాణా నేరం మాత్రమే కాదని.చాలా ప్రమాదకరమైనదని అధికారులు చెబుతున్నారు.

స్మగ్లర్లు భద్రత గురించి పట్టించుకోరని.వారి లాభాల కోసమే శ్రద్ధ వహిస్తారని చెప్పారు.

తాజా వార్తలు