గత మూడు రోజులుగా ఎక్కడ చూసిన ఈ యువ హీరో పేరు మారుమోగి పోతుంది.ఎందుకంటే ఈయన నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ఈ రోజు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.
తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి పేరు సంపాదించుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు.ఈయన యూత్ ను బాగా ఆకట్టు కున్నాడు.
తాను హీరోగా నటించిన ఫలక్ నమ దాస్ సినిమాతో ఈయన విమర్శకుల ప్రశంసలు అందుకుని యువ హీరోల్లో ఒకరిగా స్థానం సంపాదించు కున్నాడు.
స్టార్ హీరో కాకపోయినా విశ్వక్ సేన్ డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అదర గొడుతాడు.
ఇక అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా కోసం విశ్వక్ సేన్ చాలా కష్టపడ్డాడు.ఎన్నో వివాదాలను ఎదుర్కొని మరీ ఈ సినిమాను రిలీజ్ చేసారు.ఈ ప్రొమోషన్స్ లో భాగంగానే ఈయన లైవ్ ఫ్రాంక్ వీడియోలు చేయగా అవి కాస్త దెబ్బ కొట్టాయి.దీంతో ఈయన మ్యాటర్ కాస్త మారుమోగి పోయింది.
విశ్వక్ సేన్ ను ఒక ప్రముఖ ఛానెల్ వారు స్టూడియోకి పిలిచి మరీ ఇంటర్వ్యూ చేయాలనీ భావించి ఆయనను పిలిపించారు.దేవి నాగవల్లి తో లైవ్ డిబేట్ కూడా జరిగింది.
ఈ డిబేట్ లో యాంకర్ దేవి ఆవేశంలో విశ్వక్ సేన్ ను గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అంటూ అవమానించారు.దీంతో ఈయనకు పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చారు.
నాని సైతం బహిరంగంగా స్పందించారు.

మీకు సినీ ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఎలా కనిపిస్తున్నారు అంటూ ఆ ఛానెల్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.ఈ క్రమంలోనే ఈయన నటించిన సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా రాస్తున్నారు.
అయితే అన్ని ఛానెల్స్ పాజిటివ్ రివ్యూలూ ఇస్తున్నారు.కానీ సదరు ఛానెల్ పాజిటివ్ గా స్పందిస్తుందా లేదా అనేది అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి ఈ మ్యాటర్ లో విశ్వక్ సేన్ పై ఆ ఛానెల్ వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.







