తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టీయూడబ్ల్యూజే -ఐజేయు) ఖమ్మం జిల్లా కమిటీ ప్రాతినిధ్యం మేరకు ఖమ్మం జిల్లాలో పనిచేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పిల్లలకు ఖమ్మం జిల్లా( Khammam District )లో నిఅన్ని ప్రైవేట్ పాఠశాలలో 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ( Somasekhara Sarma ) సర్క్యులర్ జారీ చేశారు.
ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో సర్క్యులర్ కాపి ని టియూడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం జిల్లా కమిటీ బాధ్యులకు అందజేశారు.
సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పించాలని తమ యూనియన్ చేసిన విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన డీఈవో వెంటనే సర్క్యులర్ జారీ చేస్తూ అన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు, ప్రైవేట్ పాఠశాల యజమానుల సంఘానికి, మండల విద్యాశాఖ అధికారులకు పంపించారని, కావున జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా( Electronic media ) అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే ఐజేయు నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు వై మాధవరావు జనార్ధన చారి తదితరులు పాల్గొన్నారు.
Latest Khammam News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy