ఆ ఆటోలో 5 అడుగుల కొండచిలువ.. డ్రైవర్ ఏం చేశాడంటే?

ఈ మధ్య కాలంలో జంతువులు జనజీవన ప్రాంతాల్లోకి వస్తున్నాయి.

అడవిలో బోర్ కొట్టిందో ఇంకేవైనా కారణాలు ఉన్నాయో తెలీదు కానీ పాములు, కొండచిలువలు ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి.

ఒకవైపు కరోనా మహమ్మారి వల్ల భయాందోళనకు గురవుతుంటే పాములు, కొండ చిలువలు ప్రజలను మరింత భయపెడుతున్నాయి.దేశంలోని పలు ప్రాంతాల్లో బాత్ రూమ్ ల్లోనూ, ఇంట్లోనూ పాములు, కొండచిలువలు దర్శనమిస్తూ ఉండటం గమనార్హం.

తాజాగా ఢిల్లీలో ఒక కొండచిలువ ఏకంగా ఆటోలో ప్రత్యక్షమైంది.వేగంగా కదులుతున్న ఆటోలో కొండచిలువ ప్రత్యక్షం కావడంతో డ్రైవర్ గజగజా వణికిపోయాడు.

అకస్మాత్తుగా ఆటోలో పైథాన్ కనిపించడంతో డ్రైవర్ ఒకింత ఆశ్చర్యానికి గురి కావడంతో పాటు షాక్ అయ్యాడు.ఆ పైథాన్ ఎప్పుడు ఆటో ఎక్కిందో డ్రైవర్ కు అస్సలు అర్థం కాలేదు.

Advertisement

కొన్ని క్షణాల పాటు ఏం చేయాలో డ్రైవర్ కు పాలుపోలేదు.డ్రైవర్ ఆటోను డ్రైవ్ చేసే సమయంలో అతను తప్ప మరెవరూ ఆటోలో లేరు.

ఒక్కసారిగా కొండచిలువ కనిపించడంతో డ్రైవర్ ఒళ్లంతా చెమటలు కారాయి.అయితే అదే సమయంలో డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించి సిఎన్జి కిట్ కింద వంక‌ర‌గా ఇరుక్కొని ఉన్న పాము గురించి వన్యపాణి ఎన్జీవో నంబర్ కు ఫోన్ చేసి డ్రైవర్ తనకు సహాయం చేయాలని కోరాడు.

విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీం సభ్యులు ఆటో ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు.మొదట ఆటో డ్రైవర్ కు వాళ్లు ధైర్యం చెప్పారు.

ఆ తరువాత గంటకు పైగా శ్రమించి సిఎన్జీ కిట్ లో ఇరుక్కున్న కొండచిలువను బయటకు తీశారు.ఆ తరువాత ఆ కొండచిలువను ఊరికి దూరంగా ఉన్న అడవిలో రెస్క్యూ టీం వదిలిపెట్టారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

కొండచిలువను రెస్క్యూ టీం తీసుకెళ్లడంతో ఆటో డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నాడు.గతంలో పాముల వల్ల భయాందోళనకు గురయ్యేవాళ్లమని.

Advertisement

ఇప్పుడు పైథాన్ ల వల్ల భయాందోళనకు గురి కావాల్సి వస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు