దారుణం: మూడేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం...

తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు, చట్టాలు తీసుకొస్తున్నాఅత్యాచారాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది.

తాజాగా ముక్కుపచ్చలారని మూడు సంవత్సరాలు కలిగినటువంటి ఓ చిన్నారిపై కాటికి కాళ్ళు చాపుకొని సిద్ధంగా ఉన్నటువంటి 80 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుని మరోసారి కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఎస్.ఆర్.ఆర్ తోట ప్రాంతంలో తుమ్ము కేదారి అనే 80 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు.ఆ వృద్ధుడు నివసిస్తున్న ఇంట్లోనే పక్క పోర్షన్లో మరో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు.

3 Years Old Girl Raped By 80 Years Old Men In Telangana-దారుణం: మ

వీరికి మూడు సంవత్సరాలు కలిగినటువంటి ఓ చిన్నారి ఉంది.అయితే పని నిమిత్తం చిన్నారి తల్లిదండ్రులు బయటకు వెళ్ళగా ఇంటి ఆవరణలో చిన్నారి ఒంటరిగా ఆడుకుంటూ ఉంది.

దీంతో ఆ చిన్నారి పై కన్ను వేసిన టువంటి ఆ వృద్ధుడు డు చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు.దీంతో ఆ చిన్నారి ప్రతిఘటిస్తూ కేకలు వేసింది.ఆ కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకొని ఆ చిన్నారిని రక్షించారు.https://telugustop.com/wp-content/uploads/2020/01/3-years-old-girl-raped-by-80-years-old-men-in-telangana1.jpg ఈ విషయాన్ని ఆ చిన్నారి ఇ మరియు స్థానికులు చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ను సంప్రదించారు.చిన్నారి తెలిపిన వివరాల మేరకు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్టు చేసి విచారణ నిమిత్తమై రిమాండుకు తరలించారు.

Advertisement
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

తాజా వార్తలు