న్యూజిలాండ్ : ఖలిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడని.. రేడియో హోస్ట్‌పై హత్యాయత్నం, ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష

ఖలిస్తాన్( Khalistan ) భావజాలానికి వ్యతిరేకంగా గళం విప్పిన న్యూజిలాండ్‌లోని( New Zealand ) ఆక్లాండ్‌కు చెందిన రేడియో హోస్ట్ హర్నెక్ సింగ్‌పై( Radio Host Harnek Singh ) హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు ఖలిస్తాన్ మద్ధతుదారులకు కోర్ట్ శిక్ష విధించినట్లు ది ఆస్ట్రేలియా టుడే నివేదించింది.27 ఏళ్ల సర్వజీత్ సిద్ధూ ,( Sarvjeet Sidhu ) 44 ఏళ్ల సుఖ్‌ప్రీత్ సింగ్,( Sukhpreet Singh ) మరో 48 ఏళ్ల వ్యక్తులను కోర్ట్ దోషిగా తేల్చింది.

ఖలిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను ఈ ముగ్గురు హర్నెక్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను చంపాలని కుట్ర పన్నినట్లు ది ఆస్ట్రేలియా టుడే నివేదించింది.

విచారణ సందర్భంగా న్యాయమూర్తి మార్క్ వూల్‌ఫోర్డ్ మాట్లాడుతూ.సమాజ రక్షణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా బలమైన నిరోధం వుండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.హింస నుంచి సమాజాన్ని రక్షించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

డిసెంబర్ 3, 2020న హర్నెక్ సింగ్‌పై( Harnek Singh ) అతని ఇంటి ఆవరణలోనే మత ఛాందసవాదుల మూక మెరుపుదాడి చేసింది.ఆయనను ఏకంగా 40కి పైగా కత్తిపోట్లు పొడిచారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.

హర్నెక్ కోలుకోవడానికి 350కి పైగా కుట్లు, ఎన్నో శస్త్రచికిత్సలు జరిగాయి.నిందితులు హర్నెక్‌ను చంపడానికి మూడు కార్లతో అనుసరించినట్లు ది ఆస్ట్రేలియా టుడే నివేదించింది.

Advertisement

జరగబోయే ప్రమాదాన్ని ఊహించిన హర్నెక్ సింగ్ తన కారు డోర్ లాక్ చేసి, అదే పనిగా హారన్ మోగించి ఇరుగుపొరుగును అలర్ట్ చేశారు.

ప్రాసిక్యూటర్లు బాధితుడి నరకయాతనను కోర్టుకు( Court ) తెలిపారు.ఆ పత్రాల్లో ‘‘ సూర్యుడు అస్తమించినప్పుడు తన కుటుంబం ప్రతి రోజూ భయపడుతూనే వుంది.ఎవ్వరూ చట్టానికి అతీతులు కాదు, మతానికి కూడా అతీతులు కాదని నిర్ధారించినందుకు న్యూజిలాండ్ న్యాయవ్యవస్ధకు కృతజ్ఞతలు.

మీరు (నిందితులు) నన్ను చంపడానికి వచ్చారు.మీ అసాంఘిక మతపరమైన అభిప్రాయాలతో విభేదించిన వారిందరికీ హెచ్చరిక పంపాలనుకుని విఫలమయ్యారు.

నేను ఎప్పటిలాగే నా అభిప్రాయాలను, నమ్మకాలను వ్యక్తపరుస్తూనే వుంటాను.న్యూజిలాండ్ వంటి దేశంలో చర్యలకు పర్యవసానాలు వుంటాయి.దేవుడి పేరు మీద తప్పుడు పనులు చేస్తే చట్టం మిమ్మల్ని క్షమించదు’’ అని హర్నెక్ పేర్కొన్నారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

హర్నెక్‌పై దాడికి పాల్పడిన 48 ఏళ్ల ప్రధాన సూత్రధారికి పదమూడున్నర సంవత్సరాలు, సర్వజీత్ సిద్ధూకు తొమ్మిదన్నరేళ్ల జైలు, సుఖ్‌ప్రీత్ సింగ్‌కు ఆరు నెలల గృహ నిర్బంధం విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

Advertisement

తాజా వార్తలు