మహిళా దినోత్సవం సందర్భంగా షి టీమ్ అధ్వర్యంలో 3.2కె రన్

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని ఆకాంక్షిస్తూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా ఎస్.పి.

కె.అపూర్వరావు శుభాకాంక్షలు తెలిపారు.

బుధవారం జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా షి టీమ్ అధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎన్.టి.ఆర్ విగ్రహం,శివాజీ నగర్, చందమామ టవర్స్, బస్టాండ్ మీదిగా క్లాక్ టవర్ వరకు నిర్వహించిన 3.2కె రన్ ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుండాలని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మహిళలకు సంబంధించిన ఒక కొత్త అంశాన్ని ప్రపంచానికి తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు.మహిళలకు పట్టం కట్టే ఒక సరికొత్త థీమ్ తో ప్రతి సంవత్సరం మహిళల గొప్పతనాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు.

Advertisement

గతేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం వివక్షను బద్దలు కొట్టి లింగసమానత్వాన్ని పెంపొందించండి అనే థీమ్ తో నిర్వహిస్తే,ఈ సంవత్సరం లింగ సమానత్వం మాత్రమే కాదు.ప్రతి చోట మహిళలతో కూడిన సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడాన్ని ప్రచార థీమ్ గా నిర్ణయించారన్నారు.

మహిళలు పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనివి ఏమి లేవన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కొరకు జిల్లాలో షి టీమ్ మరియు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా ఆకతాయిలు ఇబ్బందులు పెడితే దైర్యంగా షి టీమ్ బృందాలకు గానీ,డయల్ 100 గానీ,సంబంధిత పోలీస్ స్టేషన్ కి గానీ ఫోన్ చేయాలని,ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద్ రావు,డిఎస్పీలు నరసింహరెడ్డి,సురేష్,సిఐలు రాజశేఖర్ గౌడ్ గోపి,చంద్రశేఖర్ రెడ్డి, శ్రీను,ఆర్.ఐలు నరసింహ చారి,స్పర్జన్ రాజ్,శ్రీను, సంతోష్,హరిబాబు,ఎస్ఐలు రాజశేఖర్ రెడ్డి, కళ్యాణ్ రాజ్ రాజీవ్, మహిళా అధికారులు మమత,శ్రావణి,విజయ, పోలీస్ కళా బృందం మరియు సిబ్బంది బాలికలు పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి కి తిరుగులేదా ? స్ట్రాంగ్ అయ్యారుగా ? 
Advertisement

Latest Suryapet News