25 బుదవారం సింగ సముద్రం ,జక్కుల చెరువు నీటి విడుదల.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల రైతులకు సాగు నీరు అందిస్తున్న సింగ సముద్రం,జక్కుల చెరువు ల నుండి నీటిని ఈ నెల 25 న విడుదల చేయనున్నట్లు బొప్పాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కొండా పురం బాల్ రెడ్డి తెలిపారు.

సింగ సముద్రం ద్వారా విడుదల అయ్యే సాగునీరు కొరుట్లపేట,ఎల్లారెడ్డిపేట, నారాయణ పూర్, సింగారం, బొప్పాపూర్, గ్రామాల రైతుల పంటలకు సాగు నీటి సౌకర్యం కలుగుతుందని,జక్కుల చెరువు ద్వారా విడుదలయ్యే నీరు గొల్లపల్లి, బొప్పా పూర్ గ్రామాల రైతులకు సాగు నీటి సౌకర్యం కలుగుతుందని బాల్ రెడ్డి తెలిపారు.

సింగ సముద్రం, జక్కుల చెరువుల తూములు ఎత్తి నీటిని విడుదల చేసే కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆయకట్టు రైతులు పాల్గొనాలని బొప్పాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కొండా పురం బాల్ రెడ్డి తెలిపారు.

భక్తులతో రద్దీగా మారిన రాజన్న ఆలయం..

Latest Rajanna Sircilla News