23 సంవత్సరాల అమ్మాయి చేత చంద్రబాబు కంచుకోట బద్దలు కొట్టిన వైసీపీ అధినేత జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19 వ తారీకు.

కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల అధికారులు.కౌంటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు.

ఈ ఎన్నికలలో జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలు అధికంగా అధికార పార్టీ వైసిపి రాబడుతోంది.కొన్ని చోట్ల క్లీన్ స్వీప్ చేసిన దాఖలాలు కూడా కనబడుతున్నాయి.

ఇటువంటి తరుణంలో చంద్రబాబు రాజకీయ కెరియర్ కి కంచు కోటగా పిలువబడే . కుప్పం నియోజకవర్గంలో కూడా వైసిపి బీభత్సమైన రికార్డు గెలుపు దక్కించుకుంది.విషయంలోకి వెళ్తే 23 సంవత్సరాల వయసు కలిగిన హాసిని అశ్విని అనే అమ్మాయి కుప్పం ఎంపీటీసీ అభ్యర్థిగా వైసీపీ పార్టీ తరఫున గెలవడం జరిగింది.

Advertisement

అక్కడ మొత్తం ఓట్లు 1240.ఉండగా వైసిపి.పార్టీకి పోలైన ఓట్లు 1143, టిడిపి పార్టీకి పోలైన ఓట్లు 70, నోటాకి 27.చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 23 సంవత్సరాల అమ్మాయి చేత జగన్.వైసీపీ జెండా ఎగరవేసిన క్రమంలో ఈ వార్త.ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది.

చంద్రబాబు నాయుడిని 23 వ సంఖ్య ఇంకా వెంటాడుతూనే ఉందని.కుప్పం నియోజకవర్గ ఎంపీటీసీ అభ్యర్థి గెలుపు పై వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్న టైంలో జగన్ పార్టీకి చెందిన 23 ఎమ్మెల్యేలను.ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా .టీడీపీలో జాయిన్ చేసుకోవడం తెలిసిందే.

ఆ తరువాత జరిగిన ఎన్నికలలో సరిగ్గా టీడీపీకి 23 ఎమ్మెల్యేలు.రావటం జరిగింది.అది కూడా 2019 మే 23 వ తారీకు రిజల్ట్ రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

ఇదే విషయాన్ని జగన్ అసెంబ్లీలో ప్రస్తావిస్తూ  దేవుడు స్క్రిప్టు రాస్తే ఇలాగే ఉంటుందని అప్పట్లో చంద్రబాబు పై సెటైర్లు వేయడం తెలిసిందే.కాగా ఇప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గం లో 23 సంవత్సరాల వయస్సు కలిగిన హాసిని అశ్విని అనే వైసీపీ యువ నాయకురాలు ఎంపీటీసీ అభ్యర్థిగా గెలవటం ఏపీ రాజకీయాల్లో.

Advertisement

ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు