అమెరికా నుంచి వెనక్కి వచ్చేస్తున్న 20వేల తెలుగు ఎన్నారైలు..!!!

అగ్ర రాజ్యం అమెరికా వెళ్లి స్థిరపడాలనే కోరిక ఎంతో మందికి ఉంటుంది.

వివిధ దేశాల నుంచీ ఎంతో మంది వలస వాసులు విద్యా, ఉద్యోగం, వ్యాపార రంగాలలో స్థిరపడాలని ఆరాటపడుతుంటారు.

అమెరికాకు వెళ్లి స్థిరపడే వారిలో అత్యధికంగా భారత్ నుంచి వెళ్ళే వారే ఎక్కువగా ఉంటారు.భారత్ నుంచీ వెళ్ళే వారిలో ముఖ్యంగా తెలుగు ఎన్నారైల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.

అలా వెళ్లి స్థిరపడిన వారిలో తెలుగు ఎన్నారైలు లెక్కకు మించే ఉన్నారు అమెరికాలో.అయితే ప్రస్తుతం అమెరికా నుంచీ సుమారు 68 వేల మంది భారతీయ టెకీలు వెనక్కి వచ్చేస్తున్నారట.

భారత్ వచ్చేస్తున్న 68 వేల మందిలో దాదాపు 20 వేల మంది తెలుగు టెకీలు కావడం గమనార్హం.ఇంత పెద్ద మొత్తంలో భారతీయులు వెనక్కి రావాడానికి గల కారణం హెచ్-1బి అవకాశాన్ని కోల్పోవడమేనని తెలుస్తోంది.

Advertisement

అమెరికా ఇమ్మిగ్రేషన్ ప్రతీ ఏటా కంప్యూటర్ రంగంలో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు 85 వేల హెచ్-1బి వీసాలు ఇస్తుంది.అయితే 2014 నుంచీ అమెరికా వెళ్ళే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతూ వచ్చింది ప్రతీ ఏటా ఈ సంఖ్య పెరగడంతో అమెరికాలో భారతీయుల సంఖ్య అన్ని దేశాల వలస వాసులకంటే రెట్టింపు అయ్యింది.

ప్రతీ ఏటా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్న వారి సంఖ్య పెరగడంతో దాదాపు 2 లక్షల మంది కేవలం విద్య కోసం వెళ్ళిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ ) అర్హతతో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 68 వేలకు చేరుకుంది.

అయితే ఓపీటీ అర్హతతో ఉద్యోగం చేస్తున్న వారికి మూడేళ్ళ వరకూ ఇచ్చిన కాల వ్యవధి ఈ ఏడాది మే నెలలో ముగియనుంది దాంతో దాదాపు 68 వేల మంది భారత్ కు తిరిగి వచ్చేయనున్నారట.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు