2021.. తెలుగులో హిట్ అయిన డబ్బింగ్ సినిమాలేంటో తెలుసా?

ఈ ఏడాది తెలుగులో పలు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి.తెలుగు జనాలను 50 సినిమాల వరకు పలుకరించాయి.

కొన్ని ఓటీటీ  వేదికగా విడుదల కాగా.మరికొన్ని థియేటర్స్ లో సందడి చేశాయి.

ఎన్ని సినిమాలు వచ్చినా.జనాలకు బాగా నచ్చిన సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి.

ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఈ ఏడాది సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన సినిమా మాస్టర్.

Advertisement

తమిళంలో విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటించిన ఈ సినిమా తెలుగులోకి డబ్బై రిలీజ్ అయ్యింది.ఈ సినిమా జనాలను బాగానే ఆకట్టుకుంది.

మంచి వసూళ్లను కూడా రాబట్టింది.అనంతరం వచ్చిన మరో సినిమా సుల్తాన్.

కార్తి, రష్మిక కలిసి నటించిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.ఇంచుమించు అదే సమయంలో వచ్చిన పునీత్ రాజ్ కుమార్ మూవీ యువరత్న సైతం బాగానే ఆడింది.

అటు శివ కార్తికేయన్ నటించిన తమిళ సినిమా వరుణ్ డాక్టర్ మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా కోసం జనాలు ఎగబడ్డారు.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

అటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీస్ గాడ్జిల్లా వ‌ర్సెస్ కింగ్ కాంగ్, స్పైడ‌ర్ మ్యాన్.నో వే హోమ్ సైతం జనాలను బాగా ఆకట్టుకున్నాయి.ఇక ఓటీటీలో విడుదలై సంచలనం కలిగించిన సినిమా జై భీమ్.

Advertisement

సూర్య నటించిన ఈ కోర్ట్ డ్రామా మంచి జనాదరణ దక్కించుకుంది.అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా జనాలు బాగా ఆకట్టుకుంది.

తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న టొవినో థామ‌స్ స్టార‌ర్ మాలీవుడ్ సూప‌ర్ హీరో ఫిల్మ్ మిన్న‌ల్ ముర‌ళి సైత బాగా ఆడుతుంది.మొత్తంగా ఈ ఏడాది చాలా సినిమాలు తెలుగులోకి వచ్చాయి.అందులో పలు సినిమాలను జనాలు బాగా ఆదరించారు.

ఏది ఏమైనప్పటీ భాష‌తో సంబంధం లేకుండా డ‌బ్బింగ్ సినిమాలు 2021లో తెలుగు జనాలను బాగానే ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు