తెలంగాణ తొలి సమాజ కవి సిద్ధప్ప వరకవి 121వ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మంగళవారం కుమ్మరి శాలివాహన మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సమాజ కవి సిద్ధప్ప వరకవి 121 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

వీరు 1903వ సంవత్సరంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లె గ్రామంలో జన్మించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరి కుటుంబం చాలా పేదరిక కుటుంబం, అలాగే సిద్ధప్ప వరకవి మా కుల అభివృద్ధికై చాలా సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగిందన్నారు .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వివిధ కులాలను ఎలా అయితే గుర్తిస్తున్నారో అలాగే మా కుమ్మరి శాలివాహన కులాన్ని గుర్తించి గ్రేటర్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మాకు సంబంధించినటువంటి మా కుల బాంధవులు అయినటువంటి సిద్ధప్ప వరకవి విగ్రహాన్ని ఆవిష్కరించి అధికారికంగా జయంతి గాని, వర్ధంతి గాని కార్యక్రమాలను చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సిలివేరి స్వామి, ఉపాధ్యక్షులు ఎదునూరి రాములు, క్యాషియర్ దరిపల్లి వెంకటేష్, ప్రధాన సలహాదారులు ఎదునూరి మల్లయ్య,ఆవునూరు ఎల్లయ్య, ఇల్లందుల వెంకట్, ఎదునూరి రామచంద్రం, పట్టణ అధ్యక్షులు ఏదునూరి అంజయ్య,ఉపాధ్యక్షులు దరిపల్లి శంకర్,శాలివాహన యువజన సంఘం అధ్యక్షులు ఎదునూరి భానుచందర్, ఉపాధ్యక్షులు ఎదునూరి గోపి, ఐలాపురం మహేష్, శంకరయ్య, రాములు, మల్లయ్య,స్వామి,లక్మిపతి, అశోక్,అఖిల్,ప్రశాంత్, మండలంలోని అన్ని గ్రామాల కుల సభ్యులందరూ పాల్గొనడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Latest Rajanna Sircilla News