రెండో ప్రపంచ యుద్ధంలో పోరాటం.. 101 ఏళ్ల వయసులోనూ సేవలు : సిక్కు సైనికుడికి బ్రిటన్ విశిష్ట పురస్కారం

భారతీయ సైనికుల ధైర్య సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వీరి పోరాట పటిమను గుర్తించిన నాటి బ్రిటీష్ ప్రభుత్వం ముఖ్యమైన యుద్ధాల్లో భారతీయ సైనికుల్నే ముందు నిలబెట్టేది.

ప్రపంచ చరిత్రలో మాయని మచ్చగా వున్న రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ( World War II ) నాటి బ్రిటిష్ ఇండియా సైన్యం పాల్గొంది.ఆనాటి యోధులకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ గౌరవం దక్కుతోంది.

తాజాగా రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడి నేటికీ జీవించి వున్న చివరి సిక్కు సైనికులలో ఒకరైన రాజిందర్ సింగ్ దత్‌ను (101)( Rajindar Singh Dhatt ) బ్రిటన్ ప్రభుత్వం ‘‘పాయింట్స్ ఆఫ్ లైట్’’( Points of Light Award ) పురస్కారంతో సత్కరించింది.ఈ మేరకు లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన యూకే ఇండియా వీక్ రిసెప్షన్‌లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.

( PM Rishi Sunak ) రాజిందర్‌కు అవార్డును ప్రదానం చేశారు.ఈ వయసులోనూ ఆయన చురుగ్గా వుండటమే కాకుండా.

Advertisement

నాటి బ్రిటీష్ ఇండియా సైన్యంలో సేవలందించిన సైనికులను ఒక చోటికి చేర్చడంలో సాయం చేస్తున్నారు."Undivided Indian Ex-Servicemens Association" పేరుతో ఒక సంస్థను స్థాపించి తన కార్యకలాపాలను సాగిస్తున్నారు.

1921లో అవిభక్త భారతదేశంలో జన్మించిన రాజిందర్ దత్ .బ్రిటీష్ ఇండియా సైన్యంలో చేరి పలు యుద్ధాల్లో పాల్గొన్నారు.1943లో హవల్దార్ మేజర్ ‘(సార్జెంట్ మేజర్)గా పదోన్నతి పొందారు.రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈశాన్య భారతదేశంలోని కోహిమాలో ఆయన జపాన్‌ దళాలతో వీరోచితంగా పోరాడారు.యుద్ధం తర్వాత రాజిందర్ కుటుంబంతో సహా లండన్‌లో స్థిరపడ్డారు.1963 నుంచి నైరుతి లండన్‌లోని హౌన్స్‌లో నివసిస్తున్నారు.

తనకు దక్కిన గౌరవంపై రాజిందర్ హర్షం వ్యక్తం చేశారు.ఇందుకు గాను బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఇన్నేళ్లుగా అసోసియేషన్ విజయానికి, ఎదుగుదలకు దోహదపడిన అసంఖ్యాక వ్యక్తుల కృషికి ఈ అవార్డ్ నిదర్శనంగా నిలుస్తోందని రాజిందర్ అన్నారు.

తన 102వ జన్మదినానికి దగ్గరవుతున్న సమయంలో సమాజానికి అర్ధవంతమైన సేవలను కొనసాగించడానికి ఈ అవార్డ్ తనకు స్పూర్తినిస్తుందని ఆయన ఆకాంక్షించారు.సమాజానికి, కమ్యూనిటికీ సేవలందించిన అత్యుత్తమ వ్యక్తులకు పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డును ప్రదానం చేస్తారు.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు