పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా :పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులు( Students ) కష్టపడి చదవాలని జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్( A Ramesh Kumar ) సూచించారు.

స్ఫూర్తి మంతుల విజయగాధలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు చదువులో రాణించాలని కోరారు.

సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ ను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెహ్రూ నగర్ ( Nehru Nagar )లో శనివారం నిర్వహించారు.జిల్లా విద్యాధికారి ఏ.రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించి, నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు.

.రాష్ట్రస్థాయిలోనూ రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) విద్యార్థులు ప్రతిభ చూపాలని ఆయన ఆకాంక్షించారు.

అనంతరం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.

రాష్ట్ర స్థాయిసోషల్ టాలెంట్ టెస్ట్ కి ఎంపికైన విద్యార్థులు

జిల్లా పరిషత్ పాఠశాలు ఇంగ్లీష్ మీడియం విభాగం నుంచి జి.విఘ్నేష్ (లింగన్నపేట), డి.వైష్ణవి (వట్టిమల్ల), డి.శ్యాం చరణ్ ( వెల్జిపూర్) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.తెలుగు మీడియం విభాగం నుంచి జి.అజయ్ (మానాల), సాయి శ్రీజ (రాచర్ల తిమ్మాపూర్), ఎ.తేజస్విని (సుద్దాల), బి సంజన (సముద్ర లింగాపూర్) రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు.రెసిడెన్షియల్ పాఠశాలల విభాగం నుంచి కె.పర్ణిక, జి.పావని (మోడల్ స్కూల్ రహీంఖాన్ పేట్), ఆర్.వైష్ణవి (మోడల్ స్కూల్ గంభీరావుపేట్) రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్టులో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి సీహెచ్.

Advertisement

పద్మజ, ప్రధానోపాధ్యాయులు నాగుల భాగ్యరేఖ( Nagula Bhagyarekha ), గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ప్రతినిధి శ్రీరాములు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రెడ్డి రవి, ప్రధాన కార్యదర్శి కె.రాజ్ కుమార్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News