2 నెలల్లో తయారు చేసిన 10 కేజీల వెండి పట్టీ.. డిజైన్ అదుర్స్!

భారతీయ మహిళలకు, పట్టీలకు విడదీయరాని బంధం వుంటుంది.ఈ క్రమంలోనే మార్కెట్లో మనకు ఎన్నో రకాల పట్టీలు( Straps ) దర్శనం ఇస్తూ వుంటాయి.

ఓ ఇద్దరు ఆడవాళ్ళు ఇక్కడ చర్చించుకున్నారంటే అందులో దుస్తులు, ఆభరణాలు గురించే ఎక్కువ టాపిక్ వుంటుంది.ఈ క్రమంలో పట్టీలు, వాటి డిజైన్ గురించి వారు ఎక్కువగా గుసగుసలాడుకుంటూ వుంటారు.

ఎందుకంటే ఇవి మహిళలకు ప్రత్యేక అందాన్ని ఇవ్వడమే కాదు.వారు నడుస్తూ వున్నపుడు ఘల్లు ఘల్లు మని ధ్వనిస్తాయి.

అది మన మగమహారాజులకు ఎంతో శ్రావ్యంగా వుంటుంది మరి.ఇక ఈ నేపధ్యంలో పుణేకు చెందిన ప్రముఖ నగల వ్యాపారి తేజ్‌పాల్ రాంకాది ( Tejpal Rankadi )భారతీయ సంస్కృతిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగాలనే ఉద్దేశంతో పుణేలో( Pune ) 10 కేజీల వెండి పట్టీని( 10 kg silver bar ) తయారు చేయడం జరిగింది.ఈ కాన్సెప్ట్ కోసం మొత్తం 5 మంది కళాకారులు సుమారు 2 నెలల పాటు పగలు రాత్రి శ్రమించి సదరు వెండి పట్టీని సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.కాగా ఈ ఒక్క పట్టీ ధర రూ.8 లక్షల 50 వేలు.ఈ నేపధ్యంలో మేకర్స్ మాట్లాడుతూ.

Advertisement

“కొత్త తరాలు మన సంస్కృతిని బాగా అర్థం చేసుకోవాలనీ, అందుకనే ఇలాంటి ఆభరణాన్ని తయారు చేశాం” అని చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఇండియాలో చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు వెండి పట్టీలు( Silver straps ) ధరించే సంప్రదాయం ఉందనే విషయం అందరికీ తెలిసినదే.ఇది అందంతో పాటు ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనాలను చేకూరుస్తుంది మరి.మహిళలు దీనిని ధరించడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.శరీరంలో వున్న అధిక వేడిమిని ఇది లాగేస్తుంది.

కాగా వారు తయారు చేసిన పట్టి భారత దేశంలోనే అత్యంత పెద్దది అని సమాచారం.దాంతో ఇది రికార్ద్దుల్లోకెక్కింది.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement

తాజా వార్తలు