మ‌హేష్‌ను టెన్ష‌న్ పెడుతోన్న ఏపీ పాలిటిక్స్‌

రాజ‌కీయాల‌కు ఎంత దూరంగా ఉండాల‌నుకున్నా సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు చుట్టూనే అవి తిరుగుతున్నాయి.రాజ‌కీ యాలు త‌న‌కు సెట్ అవ్వ‌వ‌ని.

మ‌హేశ్ ఎప్ప‌టినుంచో చెబుతూ వ‌స్తున్నాడు.కానీ రాజ‌కీయాలు మాత్రం ఆయ‌న్ను వెతుక్కుంటూ వ‌స్తున్నాయి.

మ‌హేశ్‌ను సొంతం చేసుకునేందుకు అటు బాబాయ్‌, ఇటు బావ ఎవ‌రికి వారు తెగ ప్ర‌య‌త్ని స్తున్నారు.మ‌హేశ్ మా వాడు అంటే కాదు కాదు మావాడు అంటూ వంతులేసుకుంటున్నారు.

దీంతో అటు ఫ్యాన్స్ కూడా రెండుగా చీలిపోతున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.ఇది మ‌హేశ్‌ను మ‌రింత టెన్ష‌న్ పెడుతోంద‌ట‌.

Advertisement

నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లోనే ఇలా ఉంటే ఇక 2019 ఎన్నిక‌ల్లో మ‌రింత పెర‌గ‌చ్చ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.ఏపీ రాజ‌కీయాలు టాలీవుడ్ సూప‌ర్ స్టార్‌ మ‌హేశ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేసేస్తున్నాయి.

రాజ‌కీయాలంటే ఎప్పుడూ దూరంగా మ‌హేశ్‌.ఎన్నిక‌ల స‌మ‌యానికి సెంట‌ర్ ఆఫ్ పాలిటిక్స్ అయిపోతున్నారు.

ముఖ్యంగా బావ గ‌ల్లా జ‌య‌దేవ్ ఒక పార్టీలోనూ, బాబాయ్ ఆదిశేష‌గిరిరావు మ‌రో పార్టీలో ఉండ‌టం.ఇప్పుడు మ‌హేశ్‌ను.

క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డేస్తోంది.ఎవ‌రికి వారు మ‌హేశ్ స్టార్ డ‌మ్‌ను త‌మ సొంతం చేసుకుని.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?

ల‌బ్ధి పొందాలని చూస్తున్నారు.నంద్యాల ఎన్నిక‌ల నుంచి మొద‌లైన ఈ వార్‌.

Advertisement

ఇప్పుడు కాకినాడ‌లోనూ మొద‌లైంది.ఎవ‌రికి వారు పోటాపోటీగా స‌మావేశాలు పెట్టి.

మ‌హేశ్ అభిమానుల మ‌ద్ద‌తు కోసం ప్ర‌యత్నిస్తున్నారు.సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులు కాకినాడ నగరపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని గుంటూరు ఎంపీ, మహేశ్ బావ గల్లా జయదేవ్ అభ్యర్థించారు.

నంద్యాల ఉప ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరుగుతాయనగా, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నంద్యాల మహేశ్ అభిమానులతో సమావేశమై, వైకాపాకు మద్దతు ప్రకటింపజేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆదిశేషగిరిరావు పేరును ప్రస్తావించకుండా, కొందరు కావాలనే మహేశ్, కృష్ణ అభిమానులు వైకాపావైపు ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

తాను గుంటూరులో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఘట్టమనేని అభిమానులంతా తనకు మద్దతు పలికినందునే గెలిచానని, ఇప్పుడు వారంతా టీడీపీవైపే ఉన్నారని అన్నారు.`మహేశ్ బాబు అనే వ్యక్తి.

హీ ఈజ్ ఏ సూపర్ స్టార్.అయనకు పొలిటికల్ అఫిలియేషన్ లేదు.

ఉండకూడదని కూడా ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు.సో.ఆయన పేరు అనవసరంగా పాలిటిక్స్ లోకి తెచ్చేది మంచిది కాదు.మహేశ్ బాబు, కృష్ణ ఫ్యాన్స్ ఎక్కువ మంది తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తారు కానీ, వేరే పార్టీకి కాదు.

జరుగుతున్న ప్రచారం అవాస్తవం` అని గల్లా జయదేవ్ అన్నారు.ఓ వైపు బాబాయ్ ఇలా అంటున్నాడు.మ‌రో వైపు బావ అలా అంటున్నాడు సో మ‌హేష్ ఫ్యాన్స్ రెండుగా చీలుతున్నారు.

తాజా వార్తలు