బీబీనగర్ రైల్వే రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ తెరవండి...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్( Bibinagar ) మండల కేంద్రం పట్టణంగా దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల శాతం రోజురోజుకు పెరుగుతోంది.

కానీ,బీబీనగర్ రైల్వే స్టేషన్( Bibinagar Railway Station ) లో రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ లేక ప్రయాణికులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏడాది క్రితం ఇక్కడి బుకింగ్ కౌంటర్ క్లోజ్ చేయడంతో ఇక్కడి నుండి ఘట్కేసర్, భువనగిరి రైల్వే స్టేషన్లకు వెళ్ళి టిక్కెట్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుందని, దీని వలన చాలా ఇబ్బంది అవుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి బీబీనగర్ రైల్వే స్టేషన్లో బుకింగ్ కౌంటర్ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

కొండాపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Latest Video Uploads News