నీళ్ల వివాదంలో కొత్త ట్విస్టు.. ఇలా జ‌రిగిందేంటి..?

ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ న‌డుమ నీళ్ల పంచాయితీ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది.

అన్ని పార్టీలూ ఆశ్చ‌ర్య‌పోయే విధంగా కేసీఆర్ ర‌గిల్చిన నీళ్ల వివాదం తారా స్థాయికి చేరుకుంది.

ఇక ఇప్పుడు తెలంగాణ‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉండ‌టంతోనే ఈ నీళ్ల వివాదం తెర‌మీద‌కు తెచ్చార‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.అటు జ‌గ‌న్ మీద‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్ మీద తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ గానీ, ఇటు కేసీఆర్ గానీ ప్ర‌త్య‌క్షంగా స్పందించ‌ట్లేదు.

ఇరు పార్టీలు ఈ వివాదాన్ని తారా స్థాయికి తీసుకెళ్లి త‌మ ఉనికిని కాపాడుకోవాల‌ని చూశాయ‌ని తెలుస్తోంది.శ్రీశైలం డ్యామ్‌తో పాటు నాగార్జున సాగర్ వ‌ద్ద తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయ‌డంతో ఇరు రాష్ట్రాల మ‌ధ్య వివాదం మ‌రింత ముదిరింది.

ఇక దీనిపై ఇటు తెలంగాణ మంత్రులు, అటు ఏపీ మంత్రులు తిట్ల పురాణం ఎత్తుకున్నారు.ఇక తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో అడుగు ముందుకు వేసి ఏకంగా విద్యుత్ ఉత్పత్తి జ‌రిగే ప్రాంతం వ‌ద్ద పోలీసుల‌ను కూడా ఏర్పాటు చేసింది.

Advertisement

ఇక ఇంత వాడీ వేడిగా సాగుతున్న రాజ‌కీయ నాటకంలో కొత్త ట్విస్టు ఏర్ప‌డిది.ఏపీ కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేసినా దానిపై కేంద్రం పెద్ద‌గా స్పందించ‌లేదు.కానీ కృష్ణాబోర్డుమాత్రం ముందుకు వ‌చ్చింది.

ఈ నెల 9వ తేదీన రెండు రాష్ట్రాల నీటిశాఖ అధికారులతో తాము సమావేశం నిర్వ‌హించి స‌ర్దుబాటు చేస్తామ‌ని ఏపీ ప్ర‌భుత్వానికి లేఖ రాసింది.ఇక ఇక్క‌డే అస‌లు విష‌యం అర్థం కాకుండా ఉంది.

వివాదం ఎంత ముదిరితే అంత పాజిటివ్ వేవ్ ద‌క్కుతుంద‌ని భావించిన టీఆర్ ఎస్‌, వైసీపీకి ఇది కాస్త మింగుడు ప‌డ‌ట్లేదంట‌.మ‌రి వీరి అధికారులు ఈ స‌మావేశానికి వ‌స్త‌రా రారా అన్న‌ది చూడాలి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు