అష్టాదశ పురాణాలు ఏవి ? వాటి విశిష్టత ఏమిటి ?

1) బ్రహ్మ పురాణం :

దీనికి ఆది పురాణం అనే పేరు ఉంది.పేరుకే బ్రహ్మ పురాణం కాని, బ్రహ్మని పరమాత్మగా చూపదు.

మహావిష్ణువు దశల గురించి, శివుడి గురించి ఎక్కువ చర్చ ఉంటుంది.

2) పద్మ పురాణం :

విష్ణువు నుంచి చూస్తే ఈ బ్రహ్మాండం ఏమిటి ? విష్ణు అవతారాల గురించి ఉంటుంది.ఇందులోనూ రాముడు - సీత కథ ఉన్నా, రామాయణంకి భిన్నంగా ఉంటుంది.

3) విష్ణు పురాణం :

మహావిష్ణువు గురించి, పరమాత్మ మహావిష్ణువుగా వివరంగా ఉంటుంది.అయితే కాలక్రమంలో దీని చాలా మారుస్తూ వచ్చారని చెబుతారు.

4) శివ పురాణం :

శైవం గురించి చెబుతుంది.శివుడి నుంచే విష్ణువు, బ్రహ్మ వచ్చినట్లు చెబుతుంది.

5) భాగవత పురాణం :

అత్యధిక ప్రజాదారణ పొందిన పురాణం, అత్యధిక మందికి తెలిసిన పురాణం.విష్ణువు అవతారాల గురించి చెబుతుంది.

6) నారద పురాణం :

భారతదేశంలో ఉన్న పవిత్ర నదుల గురించి చెబుతుంది.గ్రహాల గురించి చెబుతుంది.విష్ణువు, శివుడు, కృష్ణుడు, లక్ష్మిదేవి గురించి విపులంగా ఉంటుంది.

7) మార్కండేయ పురాణం :

వైష్ణవం, శైవంకి భిన్నంగా, శక్తి గురించి చెప్పే పురాణం ఇది.అంటే నారాయణుడు కాదు, శివ పురాణంలో చెప్పినట్టు శివుడు కాదు, ఆదిశక్తి, అంటే ఓ మహిళని సృష్టికర్తగా చూపుతుంది.

8) అగ్ని పురాణం :

రాజకీయాలు, వాస్తు శాస్త్రం, సైన్యం, సైన్స్ .ఇలా ఇప్పుటి ప్రపంచంలో ఉన్న ఎన్నో విషయాల గురించి అప్పుడే చెప్పారు.

9) బ్రహ్మాండ పురాణం :

న్యాయం, ప్రభుత్వాలు, రాజకీయాలు ఇలాంటి అంశాలు ఎన్నో ఉంటాయి.లలీత సహస్ర నామాలు ఇందులో ఉండటం విశేషం.

10) మత్స్య పురాణం :

పేరుకి తగ్గట్టే విష్ణుమూర్తి పది అవతారాల్లో ఒకటైన మత్స్య అవతారం గురించి చెబుతుంది.బ్రహ్మ - సరస్వతి బంధం, నర్మదా నది విశిష్టత ఇతర ప్రధాన అంశాలు.

Advertisement

11) బ్రహ్మవైవర్త పురాణం :

దేవుళ్ళు, దేవతల ప్రేమకథలు ప్రధాన అంశం.

12) వామన పురాణం :

ఇది ఒకప్పుడు వైష్ణవంకి సంబంధించిన పురాణం అంట.ఇప్పుడు శైవంకి సంబంధించింది అని చెబుతారు.మార్పులు జరిగాయి అంట.

13) లింగ పురాణం :

శివుడు లింగాన్ని సృష్టికి మూలంగా చూపుతుంది.బ్రహ్మ - విష్ణువుల గొడవ కథ ఇందులోదే.

14) వరాహ పురాణం :

పేరులో ఉన్నట్లే నారాయణుడి వరాహ అవతారం ప్రధానం అంశం.అయితే కృష్ణుడు మరియు దుర్గ గురించి కూడా వివరాలు ఉంటాయి.

15) వాయు :

అతి ప్రాచీనమైన పురాణాల్లో ఒకటి.తెలుగు రాష్ట్రాలు తెలంగాణ - ఆంధ్ర ప్రదేశ్ గురించి కూడా ఇందులో ఉండటం విశేషం.

16) స్కంద పురాణం :

శివుడి కుమారుడు కార్తికేయుడి గురించి ఎక్కువ ఉంటుంది.భారత దేశంలోని పవిత్ర స్థలాల గురించి కూడా ఉంటుంది.

17) కుర్మ పురాణం :

నారాయణుడి అవతారం కుర్మ గురించి ఇందులో ఉంటుంది.అత్యంత ఆసక్తికరమైన పురాణంగా దీనికి పేరు.

18) గరుడ పురాణం :

ఈ పురాణం గురించి మీకు తెలిసిందే.స్వర్గం, నరకం, జన్మలు పునర్జన్మలు, పాపలు, పుణ్యాలు, శిక్షలు .ఇలా అన్ని ఉంటాయి.ఇది కూడా వైష్ణవ పురాణం.

పసుపు, నిమ్మ టీ తో ఎన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు